చంద్రబాబు యోగాక్లాస్‌

యోగా డే సంద‌ద‌ర్భంగా చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నాడు. తిమ్మినిబమ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డం తెలుసు కాబ‌ట్టి ఆయ‌న యోగాకి కొత్త అర్థాలు చెప్పాడు. 
ప‌ద్మాస‌నం: ఇది సుఖాస‌నం. ఈ ఆస‌నంలో కూచుని కూచుని నేను ప‌ద్మశ్రీ ఎన్టీయార్‌కి వెన్నుపోటు పొడిచాను.
చ‌క్రాస‌నం: చ‌క్రం అంటే నాకిష్టం. వెనుక‌టికి కేంద్రంలో నేనే చ‌క్రం తిప్పా. మ‌న‌మెప్పుడూ అధికారం కోసం చ‌క్రం తిప్ప‌లే త‌ప్ప‌. జ‌నం మేలు కోసం కాదు. అందుకే రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. 
మ‌త్సాస‌నం: మ‌త్స్యం అంటే చేప‌. మ‌నం చేప‌ల్ని ప‌ట్టాలే త‌ప్ప చేప‌లా దొరికిపోకూడ‌దు. రేవంత్‌రెడ్డి వ‌ల్ల నేనోసారి కేసీఆర్ గ‌లానికి చిక్కుకున్నా. ఇప్ప‌టికి అది నా నెత్తిన వేలాడుతుంది. 
శీర్షాస‌నం: ప‌్ర‌తిది త‌ల‌కిందులుగా మాట్లాడ‌డం నా అల‌వాటు. ఖ‌జానాలో డ‌బ్బులు లేవు అంటూ వుండాలి. వేల‌కోట్ల అభివృద్ధి జ‌రుగుతూ వుంద‌ని చెబుతూ వుండాలి. ఏది నిజ‌మో తెలియ‌క జ‌నం శీర్షాస‌నం వేస్తారు. 
మ‌క‌రాస‌నం: అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడు మొస‌లిలా అలా ఓ ప‌ట్టు ప‌ట్టాలి. కాంగ్రెస్‌లో ఓడిపోయిన నేను, ఎన్టీయ‌ర్ ముఖ్య‌మంత్రి కాగానే వెళ్లి కాళ్లు ప‌ట్టేశాను. అది విడిపించుకోలేక ఆయ‌న గ‌జేంద్రుడిలా బావురుమ‌న్నారు. 
భుజంగాస‌నం:  రాజ‌కీయాల్లో పాముని ఆద‌ర్శంగా తీసుకోవాలి. నీళ్ల పాములా క‌నిపిస్తూ తాచుపాములా కాటేయాలి.
సాష్టాంగాస‌నం: అవ‌స‌ర‌ముంటే సాష్టాంగ‌న‌మ‌స్కారం చేయాలి. తీరిపోయాకా మ‌నం న‌మ‌స్క‌రించిన కాళ్ల‌ని లాగి అవ‌త‌ల‌ప‌డేయాలి. 
బ‌కాస‌నం: బ‌కం అంటే కొంగ‌. తినాల్సిన‌దంతా తింటూనే మ‌నం కొంగ‌జ‌పం చేయాలి. మెడ‌లో రుద్రాక్ష‌మాల ధ‌రించి రొయ్య‌ల‌బుట్ట‌లు మాయం చేయాలి. 
సింహాస‌నం: మ‌నం పిల్లి అయిన‌ప్ప‌టికీ సింహాంలా గ‌ర్జించాలి. అవ‌త‌లివాడు ఇది క‌నిపెడితే తోక ముడ‌వాలి.
చివ‌ర‌ది శశాస‌నం: మ‌నం ఎన్ని ఆస‌నాలు, వేషాలు వేసినా జ‌నం చివ‌రికి క‌నిపెడ‌తారు. అప్పుడు మ‌నకు మిగిలేది శ‌వాస‌నం.
Back to Top