రాజధాని గుట్టు బయట పెట్టిన చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్ర‌బాబు  ప్రెస్‌మీట్ పెట్టాడు

``
రాజ‌ధాని
 వ్య‌వ‌హారంలో భూకుంభ‌కోణం జ‌రిగిందా లేదా? `` సూటిగా అడిగారు విలేక‌రులు.

``
కుంభ‌కోణం అంటే
అది త‌మిళనాడులోని ఊరు,
అక్క‌డ ఈశ్వ‌రుడి
ఆల‌యం ఉంది. ఇక భూమిని హింధీలో జ‌మీన్ అంటారు. మీనం అంటే సంస్కృతంలో చేప అని
అర్థం. చేప‌కి కూడా చ‌లి పుట్ట‌డ‌మే రాజ‌కీయం`` అన్నాడు బాబు.

``
మాక్కావ‌ల‌సింది
డొంక‌తిరుగుడు స‌మాధానాలు కావు``

``
తీగ‌లాగితే డొంక
క‌దులుతుంది. మా చిన్న‌ప్పుడు షాట్ క‌ట్‌లో వెళ్ళాలంటే డొంక రోడ్డులో
వెళ్ళేవాళ్లం. ఆల్ రోడ్స్ లీడ్స్‌టు రోమ్‌. సింగ‌పూర్ త‌ర‌హా రాజ‌ధానిని
నిర్మిస్తాం``

``
పేద‌రైతుల నుంచి
భూములు లాక్కున్నారాలేదా?``

``
పేద, ధ‌నిక అనేది మ‌న భ్ర‌మ మాత్ర‌మే. దేవుడి దృష్టిలో
అంద‌రూ స‌మాన‌మే. ప్ర‌తి మ‌నిషికి ఆర‌డుగుల నేల త‌ధ్యం, రైతులకు సేద్య‌మే గిట్టుబాటు కాక‌, భూముల్ని తెగ‌న‌మ్ముకుంటున్నారు. ఇక
లాక్కునేవారెవ‌రు?
పీక్కునేవారెవ‌రు?

``
మీ చిన‌బాబు
లోకేష్ వంద‌ల‌కోట్ల భూముల్ని తినేసాడా లేదా?``

``
మా చిన‌బాబుకి
ఇప్ప‌టికీ అన్నం తిన‌డ‌మే స‌రిగా రాదు. ఇప్ప‌టికీ వాళ్ల మ‌మ్మీ స్పూన్‌తో
తినిపిస్తుంది. ఇక కోట్ల రూపాయ‌ల భూముల్ని ఎలా తింటాడు?``

``డాక్యుమెంట్ల‌లో వాస్త‌వాలు ఉన్నాయి క‌దా``

``
కంటికి క‌నిపించేది
వాస్త‌వం కాదు,
క‌న‌ప‌డ‌ని
వాస్త‌వాలు ఎన్నో వుంటాయి. డాక్యుమెంట్ల‌ను ఎవ‌రైనా సృష్టిస్తారు. ఉద్యోగుల‌కు
ఇంక్రిమెంట్లు,
 విలేక‌రుల‌కు
డాక్యుమెంట్లు ముఖ్యం.

``
నిజాన్ని నిజ‌మ‌ని
ఎన్న‌టికీ ఒప్పుకోరా?``

``
తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డంతోనే నా రాజ‌కీయం మొద‌లైంది.
రెండెక‌రాల‌తో మొద‌లై ల‌క్ష‌కోట్ల‌కు చేరుకున్నాను. నిజాన్ని నిజ‌మ‌ని ఒప్పుకుంటే
రాజ‌కీయం మానేసి సాధువుల్లో క‌లిసిపోవాలి. ఈ లౌక్యం తెలియ‌క‌నే మా మామ ఎన్టీయార్
మునిగిపోయాడు.``

``
ప్ర‌భుత్వ‌మే
ప్ర‌జ‌ల్ని దోచుకుంటే ఇక దిక్కెవ‌రు?``

``
అంద‌రికీ దేవుడే
దిక్కు. మా ప్ర‌భుత్వం వున్న‌దే ప్ర‌జ‌ల్ని ముంచ‌డానికి, ప్ర‌జ‌ల సొమ్ముదోచుకోక‌పోతే ఇక ప‌ద‌వులు
ఎందుకు?``

``
ఇంత‌కూ రాజ‌ధానినైనా
నిర్మిస్తారా లేక అదీ ఇంతేనా?``

``
రాజ‌ధాని అనేది
దేవతావ‌స్త్రం,
అంద‌రికీ క‌నిపిస్తూవుంటుంది
కానీ వాస్త‌వానికి అక్క‌డ ఏమీ వుండ‌దు, ఈ లోగా ల‌క్ష‌ల కోట్ల రియ‌ల్ వ్యాపారం
 పూర్త‌వుతుంది. అయినా ప్ర‌జ‌లు మూర్ఖులు , రాజ‌ధాని అన‌గానే ప్ర‌తివాడు చందా
ఇస్తున్నాడు కానీ,
ఇన్ని కోట్ల‌తో
రాజ‌ధాని నిర్మాణం మ‌న‌కు అవ‌స‌ర‌మా?ప‌రిపాల‌న‌కు నాలుగు భ‌వ‌నాలు చాల‌వా అని ఒక‌డైనా అడిగాడా?ప‌రిపాల‌న స‌క్ర‌మంగా చేయ‌గ‌లిగిన‌వాడికి రాజ‌భ‌వ‌నాలు అక్క‌ర‌లేదు. జ‌నాలు
కూడా అమాయకులు. వీళ్ల‌కు క‌ళ్ళ‌ముందు ఎప్పుడూ ఏదో మాయ‌కావాలి. అదే నేను చూపించాను.
మాయ మ‌శ్చింద్రిని నేనే. మాయల‌ఫ‌కీర్ని నేనే`` అని బాబు ముంగిచాడు.

 -- రాహుల్ 

Back to Top