చంద్రబాబు రీమేక్ చరిత్ర

ఒక భాష లోని సినిమాను కొన్ని మార్పులతో మరొక భాషలోకి తర్జుమా చేసుకోవడమే రీమేక్ అంటే. అయితే ఒరిజినల్ హిట్ అయినట్టు రీమేక్ హిట్ అవ్వాలన్న రూలేం లేదు. ఎక్కువ సార్లు రీమేక్ లు అట్టర్ ఫ్లాప్ లు అయ్యాయి. ఇది సినిమా పరిభాష. మరి పొలిటికల్ రీమేక్ అంటే…?
మీకు అర్థమయ్యేల మంచి ఉదాహరణలతో చెపుతాను.
దివంగత నేత వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్నిప్రవేశ పెట్టి పేదలకు ఉచిత వైద్యాన్ని అందించారు.
చంద్రబాబు అదే పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు గా రీమేక్ చేసారు. వైయస్సార్ పేరు, ఫొటో కనిపించకుండా చేయాలన్న తాపత్రయం పాపం బాబుది. కాని ఏం లాభం ఒరిజినల్ ఆరోగ్యశ్రీ పథకం అచ్చుగుద్దినట్టు జన నేత బొమ్మను ప్రజల గుండెల్లో ప్రింట్ చేసేసింది. దాంతో నేటికీ ప్రజలు ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీ గానే పిలుస్తున్నారు. 
ఇలాంటిదే మరో ఉదాహరణ
108- ఈ పేరు చెప్పగానే కుయ్ మనే అంబులెన్స్ శబ్దం గుర్తుకు వచ్చింది కదూ. అవును. వైయస్సార్ మానసపుత్రికల్లో ఒకటి 108. ఒక్క ఫోన్ కాల్ తో నిమిషాల్లో బాధితులకు బాసటగా నిలిచింది 108 సర్వీసు. 
ఇక్కడ కూడా చంద్రబాబు వైయస్ సంక్షేమ పథకాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి దాని పేరు మార్చి, తీరు మార్చి రీమేక్ చేసారు. ఇప్పుడు తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ సేవ పేరిట 108ని రీమేక్ చేసారు. 
108 సర్వీసులో తల్లి బిడ్డలకే కాదు ప్రమాదాలు, వివిధ అత్యవసర సందర్బాలన్నింటికీ సేవలు అందేవి. ఇప్పుడు 102లో కేవలం తల్లీబిడ్డల కు మాత్రమే ప్రవేశం. 
ఇంతెందుకండీ - 
2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు పాలనలో రైతుల ఆత్మహత్యలకు కలత చెంది, వారి కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేసారు. 
2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడం కోసం వస్తున్నా మీకోసం అంటూ అదే పాదయాత్రను రీమేక్ చేసారు. 
వైయస్సార్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టగా, బాబు యాత్రలో ప్రజలంతా సవాలక్ష ప్రశ్నలతో వేధించారు. 
ఇదీ చంద్రబాబు రీమేక్ లైఫ్ హిస్టరీ. ఇంకా చాలా ఉన్నాయి…చెప్పుకుంటే…చరిత్రను తవ్వే కొద్దీ చంద్రబాబు కాపీయింగుల్లో కింగ్ అని తెలుస్తూ ఉంటుంది.  బాబు బండారం బయటపడుతూ ఉంటుంది.

Back to Top