నారా - గోదా - కృష్ణ‌

స‌ర్ నారా కాట‌న్‌ను చూసి ఆర్థ‌ర్ కాట‌న్ కుటుంబీకులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక భ‌గీర‌థుడైతే నోట మాట రాక నిశ్చ‌ష్టుడ‌య్యాడు. న‌దుల అనుసంధానానికి అప్ప‌ట్లో వాజ‌పేయికి ఐడియా ఇచ్చింది తానంటే తానేన‌ని చంద్ర‌బాబు, వెంక‌య్య నాయుళ్లు పోటీలు ప‌డి చెప్పుకున్నారు. బీజేపీ నుంచి గెలిచి టీడీపీ గాలి నీరుతో చ‌ల్ల‌గా ఉండే మంత్రి కామినేని అయితే "చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టి ప‌ట్టిసీమ పూర్తి చేశారు. ఇక అదే స్ఫూర్తితో పోల‌వ‌రం కూడా పూర్తి చేయాలి" అంటూ విన‌యంగా వేడుకున్నారు. 

గోదావ‌రి - కృష్ణ క‌లిశాయి. అనుసంధాన సంధాత‌, కాల‌వ‌ల భ‌గీర‌థ‌, పైపుల ప్ర‌దాత‌, బిందెల స్ఫూర్తిదాత‌, చెంబుల జ‌గ‌జ్జేత అంటూ కాల‌వ‌ల్లో ప‌చ్చ‌పూలు, ప‌సుపు, ప‌సుపుబ‌ట్ట‌లు చ‌ల్లుతూ నెల‌కొక‌రు పండుగ చేస్తున్నారు. ప‌ట్టిసీమ పైపుల వైపు వెళ్లిన ప్ర‌తిసారీ చంద్ర‌బాబు జ‌నానికి నీళ్లొదులుతూ ఉత్స‌వం చేస్తున్నారు. మోటారు స్విచ్ ఆన్ చేస్తూ మురిసిపోతున్నారు. చేసిన ప్రారంభాన్నే మ‌ళ్లీ మ‌ళ్లీ ప్రారంభిస్తున్నారు. 2019లోపు ఒక ప‌ట్టిసీమ‌ను ఎన్నిసార్లు ప్రారంభిస్తారో లెక్క చెప్ప‌లేరు. ఆ మ‌ధ్య గోదావ‌రికి పుష్క‌రాలొస్తే, బాబు షూటింగ్ ముచ్చ‌ట వ‌ల్ల పుష్క‌ర ఘాట్‌లో ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు జ‌ల‌స‌మాధి అయ్యాయి. అయినా గోదావ‌రి పుష్క‌రాలు సూప‌ర్ హిట్ అయ్యాయ‌ట‌. ఇప్పుడు కృష్ణా పుష్క‌రాలు ప్రారంభం కాక‌ముందే ఊరువాడా తేడా లేకుండా గుడి గోపురాల‌ను, దేవుళ్ల‌ను ద‌య‌గ‌ల బాబుగారు త‌రిమేశారు. మ‌నుషులు పోతే తూతూ మంత్రం విచార‌ణ క‌మిష‌న్‌ల‌యినా హ‌డావుడి చేశాయి. గుడి గోపురాలు లేచిపోతే నోరువిప్ప‌బోయిన బీజేపీ పైన కూడా బాబు క‌న్నెర్ర చేశారు. పాపం దేవుళ్లు! 

ఆ దేవుళ్ల‌ను న‌మ్ముకున్న బీజేపీ వారు!!
అయినా సాంకేతికంగా గోదావ‌రి న‌ది కృష్ణ‌తో క‌లిశాక పుష్క‌ర పూజ గోదావ‌రికి చేసిన‌ట్లా?  కృష్ణ‌కు చేసిన‌ట్లా?  రెండిటికే చేసిన‌ట్లా?  లేక కృష్ణ అనుకుంటూ గోదావ‌రిలో మునిగిన‌ట్లా? ఏమో ప్ర‌పంచ సంచారానంద నారాస్వామి వారు త‌ప్ప మిగ‌తావారు చెప్ప‌డం భావ్యం కాదు. 
రోజూ ఒక పండ‌గ‌, ఒక ఈవెంట్‌, ఒక ఉత్స‌వం అవ‌స‌రం. జ‌నం న‌మ్మ‌కాల‌ను ప్యాకేజీలుగా అమ్ముకోవాలి.
పుష్క‌రాలు ఇప్పుడే పుట్ట‌లేదు. ఇక్క‌డితో అంత‌మూ కాదు. కానీ త‌న‌వ‌ల్లే కృష్ణ‌మ్మ త‌ల్లి జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌ని విజ‌య‌వాడ వీధుల్లో కృష్ణాన‌ది స్వ‌యంగా హోర్డింగ్‌లు పెట్టాల‌న్న‌ది బాబు ప్ర‌య‌త్నం. కాస్త అటు ఇటుగా గోదావ‌రి పుష్క‌రాలప్పుడు కూడా ఇదే ప్ర‌య‌త్నం జరిగింది. సినిమా కెమెరాలు, డ్రోన్ కెమెరాలు తొక్కిస‌లాట‌లో ప్రాణాలు పోయేస‌రికి ఆ ప్ర‌య‌త్నం బెడిసికొట్టింది.
ప్ర‌చారం కోసం బాబు ప‌డే శ్ర‌మ‌ను చూస్తే ప‌గవాడు కూడా జాలి ప‌డ‌తాడు. కృష్ణాతీరంలో కూల్చి, గోపురాల‌ను తోసి, దేవుళ్ల‌ను త‌రిమేసి నిర్భ‌యంగా, నిస్సంకోచంగా కృష్ణాన‌దికి హ‌ర‌తి ఇవ్వ‌డం ఒక్క చంద్ర‌బాబుకే చెల్లింది.
Back to Top