బాబుగారి శ్రీరంగనీతులు

ఏరా సుబ్బీ.. ఏంది అలా తలపట్టుకు కూర్చున్నావ్! మళ్లీ ఏదైనా సందేహం పీకుతాందా ఏంటి!
అబ్బా... భలే సమయానికి వచ్చావ్ రా అబ్బీ. పీకడం కాదు... పీక్కుతినేత్తాంది బుర్రంతా.
ఏందో సెప్పు. నాకేమైనా బోధపడుతుందేమో చూత్తా.
బాధపెట్టకుండా ఉంటే చాలురా సుబ్బీ. అయినా నీకుగాకపోతే ఇంకెవరికి సెప్పుకుంటాలేగానీ.. ఒక విషయం అడుగతా చెప్పు.
ఏందో అడుగు?
అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడే మనిషిని ఏమంటార్రా అబ్బీ...
ఓహో... ఇదేమన్నా కొత్త విషయమా ఏంది. రెండు నాల్కలోడు అంటారు.
బాగా సెప్పావ్... మరి ఎక్కడికక్కడ వేషాలు మారుస్తా, రెప్పార్పకుండా ఏమార్చేవాళ్లను ఏమంటారు?
ఏరా సుబ్బీ.. ఇదేనా నిన్ను పీక్కు తినేత్తుంది అన్నావ్.
అవును ఇదేరా అబ్బీ... నా బుర్రకి తట్టడంలేదు.
ఇంతకీ ఈ డౌటు నీకెందుకొచ్చిందో చెప్పు ముందు.
ముఖ్యమంత్రి సెంద్రబాబు సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్లకు పాఠాలు చెప్పనాకి బోయాడుగందా... ఆ విషయం ఎరుకేనా నీకు?
ఆ ఎరుకేరా సుబ్బీ... ఏమైందిప్పుడు.
ఏమైందని అంత నెమ్మదిగా అడగుతావేందిరా అబ్బీ... అక్కడ ఏం మాట్లాడాడో తెలుసా?
అంతగాను ఏమన్నాడురా సుబ్బీ.
దేశ నిర్మాణంలో అధికారులే భవిష్యత్తు నాయకులట. 
అందులో తప్పేముందిరా సుబ్బీ...
అక్కడికే వత్తన్నా... దేశం అంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్టే కదా!
ఊరుకోరా అబ్బీ... మరీ పప్పులాగా మాట్లాడకు. ఆంధ్రప్రదేశ్ దేశం కాదు రాష్ట్రమని... అది దేశంలో భాగమని నాకు ఎరుకేలే.. సెప్పు.
మరి బాబుగారు అన్నట్లు అధికారులే భవిష్యత్తుకు నాయకులైతే... ఆయనగోరి పాలనలో ఐఎఎస్ లను... తాను ఏసిన జన్మభూమి కమిటీల ముందు చేతులుకట్టుకోమని ఎట్టా సెబుతాడ్రా..?
ఒక సీనియర్ ఐపిఎస్ ఆపీసరు కదా.. మంచి పేరున్నోడు కదా ఆ సుబ్రమణ్యం సారూ. ఆయన్ను నడిరోడ్డుమీద నిలబెట్టి ఈయనగారి మంత్రి, ఎమ్మెల్యేలు ఎలా బెదిరిస్తార్రా అబ్బీ..?
అవునుగందా..! నువు సెబుతుంటే నాకు యాదకొత్తాందిరా సుబ్బీ...
మనకాడ కలెక్టర్లకు అసలు విలువే లేకుండా సేత్తన్నారని ఆమధ్య ఓ పెద్ద మనిషి బహిరంగంగా విమర్శించినా సరే... ఈ బాబు నోరెత్తనేలేదు.
అంతేనా...
ఇసుక మాఫియాకి అడ్డొచ్చిందని ఒక మహిళా ఎమ్మార్వోపై ఈ బాబుగారి ఎమ్మెల్యే చేసిన దాడి చూసి లోకం సిగ్గుపడలా?
మరి అట్టాంటి మనిషి బోల్డంత అనుభవమున్న ఐఎఎస్ ఆఫీసర్లకాడికిబోయి... ఇట్టాంటి నీతికబుర్లు ఎట్టా సెప్పగలుగుతున్నాడా అని నా మైండ్ దిమ్మెక్కిపోతాందిరా అబ్బీ. చేసేవన్నీ చేత్తా... ఇలా నీతులు సెప్పే ఇట్టాంటిమనిషికి ఏ పేరు పెట్టాలా అని బుర్ర పీక్కుంటున్నా.
ఒరే సుబ్బీ... దీనికి నువ్వూ నేనూ ఇంకో వెయ్యిమంది కలిసి కూసున్నా పేరు ఎతకడం కష్టమేరా!
మరెలారా అబ్బీ... నాకు పొద్దుబోదే..!
ఒక్క మాట సెబుతా ఇనుకో. ఇట్టాంటి మనిషి పెపంచమంతా ఎతికినా నీకు దొరకడు. మరలాంటప్పుడు ఏ పేరని పెడతావ్ సెప్పు. అందుకే నామాట ఇని చంద్రబాబు అనే పేరే ఖాయం చేసుకో. అదే రైటు.
భలే సెప్పావురా అబ్బీ... ఇలాంటి లక్షణాలకి ఈ పేరే కరెట్టుగా సరిపోద్ది. 

తాజా ఫోటోలు

Back to Top