మాయా గురు మేనేజ్ మెంట్ షురు

మంగళగిరి దగ్గరున్న రిసార్ట్ అంతా సందడి సందడిగా ఉంది. ఎల్లోగాంగ్ అంతా నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పని చేసిన వారికి సన్మానం చేయాలనుకున్నారు చంద్రబాబు. దాంతోపాటే సాధారణ ఎన్నికలకు కూడా అదే పద్ధతిలో పని చేయడం గురించి క్లాసు తీసుకోవాలనుకున్నారు. ఏమీ చేయకుండానే అంతా చేసేసినట్టు మేనేజ్ చేయడంలో చంద్రబాబు మయడికే గురువు కదా మరి. 
సన్మాన సభ ప్రారంభం అయ్యింది. 
అందరికీ బొకేలు, పూలదండలు, అభినందనలు, ఆలింగనాలు అయ్యాయి. 
చంద్రబాబు మాట్లాడటం మొదలుపెట్టాడు. 
‘ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో నే చెప్పింది చెప్పినట్టు చేసినందుకే ఇవాళ మనం ఇలా సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. ఏదో చేసాం అని అనిపించేలా మేనేజ్ చేయడంలోనే ఉంటుంది అంతా. కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని నమ్మించగలగడం మనం పర్ఫెక్ట్ గా చేసిన పబ్లిక్ మేనేజ్ మెంట్. అప్పటిదాకా పట్టించుకోని మైనారిటీ, ఇతర సామాజిక వర్గాలను పిలిచి పదవులివ్వడం మనం చేసిన గ్రేట్ పొలిటికల్ మేనేజ్ మెంట్. ఓటుకింతని లెక్కగట్టేసి ఇచ్చేయడం, ఓటేయకపోతే అన్నీ ఊస్టు చేస్తానని బెదిరించడం అసలైన పోల్ మేనేజ్ మెంట్. ఇవన్నీ పక్కాగా చేసినందుకే నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ మనకి చిక్కాయి. రాబోయే ఎన్నికల్లో కూడా ఈవిధంగానే ముందుకు పోదాం’ అన్నాడు బాబు.
‘అలాగే అలాగే’ అన్నారు ఎమ్మెల్యేలంతా. 
‘మనం అమలు చేసిన పోల్ స్ట్రేటజీ, ప్రచార శైలి, ఎలక్షణ్ ఇంజనీరింగ్, బూత్ మేనేజ్ మెంట్ వివరాలతో ఒక పచ్చపుస్తకం ప్రచురిద్దాం. రాబోయే ఎన్నికలన్నిటికీ మనందరికీ అది దిక్సూచిలా ఉపయోగపడుతుంది’ అన్నాడు బాబు. 
ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొట్టారు.
లోకేష్ లేచి ‘ఇది రాజకీయ పాఠాలు నేర్పు బడిలాగా, మీరు ఎన్నికల్లో కన్నింగులు నేర్పే మహాగురువు లాగా కనిపిస్తున్నారు నాన్నారూ ‘ అన్నాడు.
కొడుకు చేత తిట్టించుకున్న తండ్రి పడే బాధ కంటే కొడుతో పొగిడించుకున్న తండ్రి పొందే ఆంనందమే ఎక్కువ కన్నీళ్లు తుడుచుకున్నాడు బాబు. 
‘నాన్నారూ నాకు ఒక డౌట్ వచ్చింది’ అడిగాడు లోకేష్ 
‘ఏమిటది అడుగు నాయనా’ పుత్రవాత్సల్యం పొంగుకు రాగా అడిగాడు చంద్రబాబు.
‘ఇప్పుడు మన పోల్ మేనేజ్ మెంట్ పుస్తకాన్ని ప్రతిపక్షాల వాల్లు కాపీ చేస్తేనో’ అన్నాడు లోకేష్ భయం భయంగా. 
‘అలాంటి కంత్రీ పనులు చేయగలిగే సత్తా మనకు మాత్రమే ఉంది నాయనా. మీ నాయన తప్ప మరెవ్వరూ ఇలాంటి మాయలు చేయలేరు’ అన్నాడు ఒక ఎమ్మెల్యే చంద్రబాబును ఆరాధనగా చూస్తూ. 
ఉబ్బి తబ్బిబై పోయాడు చంద్రబాబు. అందరికీ స్వయంగా తన చేత్తో కేకు తినిపించాడు.
సభ ముగిసింది.

Back to Top