ఇంటింటా ఎదురైన తంటా

చంద్ర‌బాబు ఇంటింటికీ కుంప‌టి యాత్ర చేప‌ట్టాడు. రాష్ట్రంలోని ప్ర‌తి ఇంటికీ వెళ్లాల‌ని త‌న పాల‌న‌లో ప్ర‌జ‌లెంత సుఖ‌ప‌డి పోతున్నారో చూడాల‌నుకున్నాడు. అలా ఓ దుర్ముహూర్తం రోజున బ‌య‌లుదేరాడు.
మొద‌టి ఇంటికి వెళ్లి త‌లుపు కొట్టాడు. 
ఛీ ఛీ అడుక్కోడానికి వేళాపాళా లేక్క దూ...ఫోఫో అని వినిపించింది లోప‌లినుంచి. 
చంద్ర‌బాబు కంగారు ప‌డ్డాడు. లోప‌లి వాళ్ల‌ను పిలిచి వ‌చ్చింది తాన‌ని చెప్పాల‌నుకున్నాడు. వెన‌కాల‌నుంచి సెక్రెట‌రీ అడ్డుత‌గిలాడు. 
వ‌ద్దుసార్ మొద‌టి శ‌కున‌మే బాలేదు. ఇంకో ఇల్లు చూద్దాం అని లాక్కెళ్లిపోయాడు.
ఈసారి మ‌ళ్లీ త‌లుపు కొట్ట‌లేదు బాబు మ‌ళ్లీ ఎక్క‌డ ముష్టోడ‌నుకుంటారో అని స్టైల్ గా డోర్ బెల్ కొట్టాడు. 
భౌభౌభౌ మంటూ శ‌ర‌వేగంగా గేటు ముందుకొచ్చిందో కుక్క‌.
ఒక్క ఉదుటున ప‌క్క‌కి జంప్ చేయ‌క‌పోతే పిక్క‌ట్టుకు పీకేసేదే...
బ‌తుకు జీవుడా అనుకున్నారు బాబు, వెన‌కున్న అధికారులు. మ‌ళ్లీ ఆ ఇంటి బెల్లు నొక్కే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. 
వేరే ఇల్లు చూసుకుందాం అనుకున్నారు.
ముందుకు వెళ్ల‌గానే అక్క‌డ ఒక ఇంట్లో త‌లుపు తెరిచి ఉంది.
గ‌బ‌గ‌బా లోప‌లికి వెళ్లిపోయాడు బాబు.
ఆ కుటుంబంలో అప్పుడే అంద‌రూ భోజ‌నం చేస్తున్నారు.
అనుకోకుండా వ‌చ్చిన ఆప‌ద‌లా ఊడిప‌డ్డ చంద్ర‌బాబును చూసి అదిరిపడ్డారు ఆ ఇంట్లో వాళ్లు.
కంగారు ప‌డ‌కండి ఇంటింటికీ కుంప‌టి పెట్ట‌డానికి సార్ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మీ ఇల్లే మెద‌టిది. మీరెంతో అదృష్ట‌వంతులు చెప్పాడు సెక్రెట‌రీ గుక్క తిప్పుకోకుండా.
మీ క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకుంటా, మీతో క‌లిసి ఉంటా, మీతో క‌లిసి తింటా చెప్పుకుపోతున్నాడు చంద్ర‌బాబు ఆశువుగా....
ఇదిగో తినండి కంచంలో తెల్లటిదొక‌టి, ప‌చ్చ‌టిదొక‌టి, ఎర్ర‌దొక‌టి తెచ్చి చంద్ర‌బాబు ముందు పెట్టాడు ఆ ఇంటి పెద్ద‌. 
ఏంటిది అడిగాడు బాబు తెల్ల‌బోయి...
తెల్ల‌టి ప‌త్తి, ప‌చ్చ‌టి పొగాకు, ఎర్ర‌టి మిర‌ప‌కాయ‌లు కోపంగా బ‌దులిచ్చాడు ఆ ఇంటి మ‌నిషి
ఇవెలా తింటార‌య్యా కోపంగా అడిగాడు బాబు.
ఆహార పంట‌లు కాక‌, వాణిజ్య పంట‌లేసుకుంటే రోజూ తినాల్సింది ఇవే మ‌రి అంత‌కంటే కోపంగా బ‌దులిచ్చాడా ఆసామి...
వ్య‌వ‌సాయం వ‌ద్ద‌ని, వ్యాపారం ముద్ద‌నే నీలాంటి వాళ్లు తిండి మాని ఇదే గ‌దా తినాలి రెట్టించాడా ఇంటాయ‌న‌.
ఇంటింటా కుంప‌టి పెట్ట‌బోతే సెగ మ‌నకే త‌గిలేలా ఉంది అనుకుని చ‌ల్ల‌గా జారుకున్నారు బాబు అండ్ కో. 
Back to Top