గొంగట్లో అన్నం – జల్లెడలో నీళ్లు

చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వేదిక మీద ప్రసంగం మొదలుపెట్టాడు. 
దాన్నిండా బోలెడు వరాలు, హామీలు, పథకాలూ, ప్రయోజనాలూను. జనం జెండా వందనం చేయడం గూడా మానేసి నోళ్లు తెరుచుకుని వింటూడిపోయారు.
అదేమంటే –
రుణమాఫీ చేస్తాను కాని బ్యాంకులో జమ అవలేదని పట్టుబట్టకూడదు.
పింఛనులిస్తాను కాని మీరు నాకు ఓటేయను అనకూడదు.
ఇంటికో ఉద్యోగం ఇస్తాను కాని జీతం ఆశించకూడదు.
రేషన్ కార్డులిస్తాను కాని రేషన్ కావాలనడగొద్దు.
అమరావతి కడతాను కాని నా మనవడు ఇల్లు కట్టుకునేదాకా మీరాగాలి.
బోలెడన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తెస్తాను. అవి కనిపించట్లేదని మీరు అడగకూడదు.
బెల్టు షాపులు ఎత్తేస్తాను కాని మీరు కళ్లుమూసుకోవాలి.
ఉద్యోగుల పదవీ కాలం పెంచుతాను కానీ ఊస్టింగ్ ఆర్డర్స్ వద్దనద్దు.
సముద్రంలో నీరు తీయగా చేస్తాను. కాని అది మీరు తాగుతాను అనకూడదు.
చిల్లుల జల్లెళ్లో మంచినీళ్లిస్తాను కారిపోతున్నాయని ఆక్షేపించకూడదు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ - 
రెండు నాలికలతో రెండు మాటలు చెబుతాను మీరు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి.
ప్రసంగం పూర్తయింది. ఈ బాబు పాలన నుండి మనకి విముక్తి ఎప్పుడో రాష్ట్రానికి స్వతంత్ర్యం ఎప్పుడో..అనుకుంటూ నీరసంగా కదిలారు ఆహుతులు.

Back to Top