బాబురే...!

పియ్యే - సార్‌ సార్‌...ఒక బ్యాడ్‌ న్యూస్‌...

బాబు  - బ్యాడ్ న్యూసా...మళ్లీ ఏం కొంప మునిగిందయ్యా...? మరో బస్సేమైనా బావిలో పడిందా...?

పియ్యే - పడింది బస్సు కాదు...

బాబు  - మరేంపడింది...

పియ్యే - మన ప్రభుత్వం సింగపూర్‌ స్టైల్లో చైనా ఇంజనీర్ల చేత కట్టిస్తున్న బ్రిడ్జీ కూలిపోయింది సార్‌...

బాబు  - వార్నీ...ఎట్లా ఎలా కూలిపోయింది...? .

పియ్యే - కాంట్రాక్టరు కక్కుర్తిపడి సిమెంట్‌కు బదులు సిమెంట్‌ కలర్‌లో ఉన్న బూడిదవాడాడంట....

బాబు  - వాడిదుంపతెగ...అంత కక్కుర్తి ఎందుకయ్యా...ఇంకా రెండేళ్లు మనమే ఉంటాంగా...? ఇంతకీ ఎవరైనా చనిపోయారా...?

పియ్యే - ముప్పయి మంది కూలీలు చనిపోయారు..పదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు...ఇరవై మంది గాయపడ్డారు....

బాబు  - వెంటనే ఆబ్రిడ్జీ కట్టిస్తున్న కాంట్రాక్టరును అరెస్టు చేయండి

పియ్యే - కుదరదు సార్‌...

బాబు  - యేం...ఎందుకు కుదరదు..?

పియ్యే - ఆకాంట్రాక్టరు మన మంత్రిగారి వియ్యంకుడు సార్‌...ఎన్నికల్లో మన పార్టీకి దండిగా విరాలాలిచ్చాడు.

బాబు  - అలాగా...అయితే వెంటనే వైయస్‌ జగన్‌ మీద కేసుపెట్టమని డీజీపీకి నేను చెప్పానని చెప్పు

పియ్యే - అదేంటండీ...కాంట్రాక్టరును వదిలేసి జగన్‌ మీద కేసు ఎలా పెడతామండీ...?

బాబు  - టీవీలు చూడ్డంలేదా..? మొన్న బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్తే ఏంజరిగింది. మనోళ్ల చేత చిన్న డ్రామా ఆడించి జగన్‌ మీదే కేసులు పెట్టించాం. అసలు విషయం పక్కన పెట్టి జగన్‌ ఇష్యూను హైలెట్‌ చేశాయి మన రంగుడబ్బాలు...

పియ్యే - రంగు డబ్బాలా?

బాబు  - అదేనయ్యా...మనకు వంతపాడే న్యూస్‌ ఛానల్స్‌...

పియ్యే - అవును...

బాబు - ఇప్పుడు కూడా అదేపాలసీ అప్లైచేద్దాం...

పియ్యే - ఎలాసార్‌...?

బాబు  - ఇప్పుడు ఆబ్రిడ్జి కూలిపోయిన చోటుకు జగన్‌ వెళ్తాడు...బాధితులను ఆదుకోవాలంటాడు..కాంట్రాక్టరును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తాడు..అదంతా మనకెలా కుదురుతుంది...? మన వేలితో మనకంట్లో పొడుసుకునేంత అమాయకులమా మనం. అందుకే రివర్స్‌లో ఆజగన్‌ మీదే కేసు పెట్టేస్తే సరిపోతుంది. వీలైతే ఆబ్రిడ్జి కూలిపోవడానికి జగనే కారణం అని కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందేమో డీజీపీని కనుక్కోమను...

పియ్యే - చూస్తే ఆవులించి నోరు మూసుకోవడం కూడా చేతగానివాడిలాగా కనిపిస్తారు కానీ మీరు మామూలు మనిషి కాదుసార్‌

బాబు  - మరి...ఈకుర్చీ ఊరికే వచ్చిందనుకుంటున్నావా...? ఇలాంటి జఫడాలుఎన్నిచేయలేదు...ఎన్ని జింగిడీలు చూడలేదు...?

(ఇంకో పీయే పరిగెత్తుకుంటూ వస్తాడు.)   సార్‌...సార్‌....

బాబు -  ఏంటయ్యా....ఏంజరిగింది...?

పియ్యే - విజయవాడ వద్ద సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిందిసార్‌...వందమంది వరకు చనిపోయారని అనుమానిస్తున్నారు...

బాబు - రైలు ప్రమాదమా...? ఇంకెందుకు ఆలస్యం..వెంటనే జగన్‌ మీద కేసు పెట్టండి...వీలైతే రోజా మీద కూడా కేసు నమోదుచేయండి. ఆయనెవరూ...అంత నోరేసుకుని మాట్లాడతాడు చూడు...ఆ... అంబటి రాంబాబు మీద కూడా కేసు నమోదు చేయమని చెప్పండి...మన రంగుడబ్బాలను అలర్ట్‌ చేయండి....ఆజగన్‌ను అన్నివైపుల నుంచి టార్గెట్‌ చేయండి...

( ??? )

బాబు - అరెరె...ఎంటయ్యా అలాపడిపోయారు...? అరె...అలాకొట్టుకుంటున్నారేంటి... సెక్యూరిటీ...సెక్యూరిటీ...అంబులెన్స్‌నుపిలవండి...                                                                       

Back to Top