డైట్ దీక్ష

పప్పు చాలా హడావిడి పడుతున్నాడు. బంతెన సన్యాసిరాజు గారొచ్చారా? మేల్చూరిని పిలిపించారా? గిరిమావిళ్లకు కాల్ చేసారా? అంటూ అధికారుల అంతు చూస్తున్నాడు చినబాబు. 
అంతా వచ్చారు సర్ మీకోసమే ఎదురు చూస్తున్నారు అన్నారు అధికారులు. 
ఉన్నట్టుండి చినబాబుకు ఇంత మంది ప్రకృతి వైద్యులు, ఆహార నిపుణులతో అవసరం ఏం వచ్చిందో అని కంగారు పడుతున్నారు. 
హాల్లో కూర్చున్న ఆ ఆయుర్వేద ప్రతినిధులందరూ చినబాబును చూసి లేచినిలబడ్డారు. 
కూర్చోండి..కూర్చోండి. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది మీతో...అన్నాడు వాళ్లకెదురుగా కూర్చుంటూ..
చెప్పండి సర్...అన్నారు అందరూ ముక్తకంఠంతో.
నాకు అద్భుతమైన డైట్ ప్లాన్ కావాలి. అందులో వెరైటీలన్నీ ఉండాలి. కొత్త పాత పద్ధతులను కలిపి చక్కటి డైట్ ప్లాన్ ఏర్పాటు చేయాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి? లంచ్ కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? స్నాక్స్ గా ఏవి తీసుకుంటే మంచిది? డిన్నర్ కి ఏది బెస్ట్ ఆప్షన్ంఅన్నీ నాకు క్లియర్ గా చెప్పండి. ఆపకుండా చెబుతున్నాడు పప్పేష్.
ఇంత అర్జంట్ గా అంత డైట్ ఫాలో కావాల్సిన వాళ్లెవరు. బహుశా చినబాబుకేనేమో అనుకున్నారు అధికారులు. నిజమే మరి ఈ మధ్య చినబాబు కాస్త ‘వెయిట్’ పెరిగాడు. తగ్గేందుకు, ఫిట్ గా ఉండేందుకు ఇప్పట్టి నుంచే డైట్ కసరత్తులు మొదలెడుతున్నాడులా ఉంది అనుకున్నారు. పన్లో పనిగా చినబాబును కాస్త పొగిడేస్తే అది ఓ పక్కన పడుంటుంది కదా అని కూడా అనుకున్నారు. 
‘బాబూ మీరేమంత దొడ్డుగా లేరు లెండి’ అని ఒకరు, ‘అబ్బే ఈ మాత్రానికే డైటింగ్ ఎందుకు? మొన్న చేసినట్టు రోజూ సైకిల్ యాత్ర చేస్తే చాలు’ అని ఇంకొకరు, ‘ నాన్నగారిలా ఫిట్ గా ఉండాలనుకుంటున్నారుంచాలా ఆనందంగా ఉంది‘ అంటూ మరొకరు ఎవరికి తోచిన స్టేట్ మెంట్ తో వాళ్లు పప్పుబాబును మెప్పించాలని తెగ తాపత్రయ పడ్డారు.
కానీ వాటన్నిటికీ పప్పు బాబు అడ్డం పడిపోయాడు. 
అబ్బా ఈ డైట్ ప్లానంతా నాకు కాదు, మా నాన్నారి కోసం అన్నాడు ఆప్యాయంగా..
అదివిని అవాక్కయ్యారు అధికారులు ప్లస్ వచ్చిన ప్రకృతి వైద్యరత్నాలు. 
నేలను తిని అరాయించుకోగల మనిషి, నదులను దోసిట్లో పోసుకుని తాగేయగల తపస్వి, ఇసుకను కూడా మింగి మాయం చేయగల వ్యక్తి అయిన మీ నాన్నగారికి ఎందుకండీ డైటుం.ఆశ్చర్యపోయి అడిగారుం
ఈ లోపల అక్కడికి వచ్చారు బాబుగారు. ఏంటి హడావిడి పప్పేష్ అడిగారు ప్రేమగా. 
అయ్యో మీరే మర్చిపోయారా నాన్నారూం నిన్నే చెప్పారు కదా నిరాహార దీక్ష చేస్తానని. హంగర్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు మీకు కావాల్సిన పద్ధతిలో అన్నీ ఎరైంజ్ చేస్తున్నా. ఇంత వరకూ ఎవరూ చేయనట్టు మీరు నిరాహార దీక్ష చేయండి ఈయన మీ ఉదయం డైట్ చూసుకుంటారు. ఈయన మీ లంచ్ డైట్ డిజైన్ చేస్తారు. ఈయన మీ డిన్నర్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు అన్నాడు పప్పేష్ చేతులూపుకుంటూం
నిరాహారదీక్ష కు డైట్ ప్లానేంటి నాయనా పప్పేషం. నా పరువు తీస్తున్నావ్ కదరా? హంగర్ స్ట్రైక్ లో డైట్ పాటిస్తారని నీకెవరు చెప్పార్రా తండ్రీ అంటూ తలపట్టుకున్నాడు బాబు. 
నాకేం తెలుసు నాన్నా ఎప్పటిలా మీరు అందరి ముందూ ఒకటి ప్రకటిస్తే దానికి నేను బిల్డప్ తో బుల్డప్ చేద్దామనుకున్నా. ఇంతకీ నిరాహారదీక్ష అంటే ఏమిటి నాన్నారూ అడిగాడు చినబాబుం
రేపు నాతో బాటు నిన్నూ కూర్చోబెడతా అప్పుడు తెలుస్తుంది లే నిరాహారదీక్ష అంటే ఏమిటో అని విసుక్కుంటూ వెళ్లిపోయాడు బాబుం
  
 
Back to Top