ఓటర్ల ప్రాప్తిరస్తు

ఎలా ఎక్కువమంది పిల్లల్ని కనకపోతే ఎలా? ఎంత నష్టం రాష్ట్రానికి, దేశానికి…ముఖ్యంగా పార్టీలకి, అందులోనూ తెలుగుదేశం లాంటి పార్టీలకి. 
పిల్లల్ని కనకపోతే పౌరులు ఎలా వస్తారు. వారు ఓటర్లుగా ఎలా మారతారు? 
అందుకే ఖచ్చితంగా అందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనాలి?
అసలు చదువుకున్న వాళ్లే బుద్ధి లేకుండా పిల్లల్ని కనడం మానేస్తున్నారు. 
పెంచడానికి భయపడి పిల్లలని కనడం మానేస్తే ఎలా?
తలసరి ఆదాయం పెరగ పోయినంత మాత్రాన పెంచలేమని పిల్లల్ని అప్పుడే వద్దనుకునే అధికారం చదువుకున్న వాళ్లకి లేదు. 
లక్షల కొద్దీ ఫీజులు వసూలు చేసుకునే శ్రీహితన్య, శ్రీమన్నారయణ లాంటి ఎన్ని స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి…రేపు పిల్లలు లేకపోతే అవన్నీఎలా నడవాలి?
లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇవ్వడానికి నిరుద్యోగులు కావాలి. పిల్లల్ని కనకుండా, జనాభా ఎదగకుండా చేస్తే నిరుద్యోగులు ఎక్కడి నుంచి వస్తారు?
పార్టీలకు కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు?
ఓట్లు వేసి గెలిపించే ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు. 
రోబోలతో పని చేయించుకోవాలి. వాటితోనే ఓట్లేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 
అందుకే వీలైనంతగా సంతానాన్ని కనండి. 
పౌరులను అదే కాబోయే ఓటర్లను వృద్ధి చేయండి. 
అదే మనకు కావాల్సింది.
చంద్రబాబు వెళ్లిపోయారు…లోకేష్ ఆలోచనలో పడిపోయారు…రాష్ట్రంలో పిల్లలు కనని దంపతులు ఎందరున్నారో లెక్కతీయాలి అని ఆలోచిస్తూ. 

తాజా ఫోటోలు

Back to Top