చంద్రబాబు మళ్లీ వేసేశాడు!

తిరుపతి వెంకన్నకి, శ్రీశైలం మల్లన్నకి, బెజవాడ దుర్గమ్మకి, సింహాచలం అప్పన్నకి, డబ్బుకి కొరతలేదు. మేనేజ్ మెంట్ కొరత ఉంది అన్నాడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు. 
ఉలిక్కపడ్డ రిపోర్టర్లు వెంటనే ఎలాంటి మేనేజ్ మెంట్ సార్? అని అడిగారు.
మా పార్టీ చేసినట్లు పోల్, పబ్లిక్ మనీ మేనేజ్ మెంట్ ఇక్కడ కూడా కావాలయ్యా అన్నాడు బాబు.
అంటే గుడికి వచ్చిన వాళ్లకి ప్రదక్షిణకింత అని ఇద్దాం అనుకుంటున్నారా? అన్నాడో విలేకరి, ఓటికింత అని నంద్యాల ఉప ఎన్నికలో మేనేజ్ చేసింది గుర్తుచేసుకుంటూ...
కాదయ్యా... ప్రదక్షిణకింత, గంట కొట్టినందుకు ఇంత, దండం పెట్టుకున్నందుకు ఇంత అని వసూలు చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు బాబు. 
బిత్తరపోయాడు ఆ విలేకరి.
ఆలయాల్లో భక్తుల సౌకర్యాల కోసం పబ్లిక్ మేనేజ్ మెంట్ స్టేటజీ ఎలా వాడతారు సార్ అని అడిగాడు మరో మీడియా ప్రతినిధి.
ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడికీ ఓ ఎల్లో బ్యాడ్జీ ఇస్తాం. దానితో ఆలయంలోకి వెళితే వాళ్లకి అవసరమైన సౌకర్యాలు, పూజలు అన్నీ ఉచితం. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం మాకే ఓటేస్తామని ఒట్టేసి వెళ్లాలి అనే కండిషన్ పెడతాం. ఇలా పబ్బిక్ మేనేజ్ మెంట్ చేస్తాం అన్నాడు చంద్రబాబు. ఆ జర్నలిస్ట్ కళ్లు తిరిగాయి.
మరి ఆలయాల్లో మీ పోల్ మేనేజ్ మెంట్ ఎలా పనికొస్తుందని మరో మీడియా మిత్రుడు అడిగాడు, ఎలక్షన్లో తప్ప గుడులలో పోలింగ్ ఉండదు కదా అనుకుని...
విచిత్రంగా నవ్వే ప్రయత్నం చేశాడు చంద్రబాబు.
దానికీ ఓ ప్లాన్ ఉంది. ధ్వజస్థంభం చుట్టూ, అదే టెంపుల్ పోల్ చుట్టూ మా హామీల బోర్డులు తగిలిస్తాం, కరపత్రాలు అంటిస్తాం అన్నాడు ఎల్లోబాబు.
విలేకర్లు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు. ఇంకాసేపుంటే తమని ఎలా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడోనని...
 

Back to Top