అఆఇఈ..!

చంద్రబాబు లోకేష్ కి తెలుగు వర్ణమాలని ఇలా నేర్పించాడు

- అధికారం-దీనికోసం సొంతమామనైనా వెన్నుపోటు పొడవాలి
   -అవినీతి-అది మన ఇంటిపేరు, రాజకీయాల్లో ఆపేరుని నువ్వు నిలబెట్టాలి
-ఆస్తి-రెండెకరాలతో నేను వేలకోట్లు సంపాదిస్తే, కూరగాయలమ్మి నువ్వు లక్షల కోట్లు సంపాదించాలి
ఇ-ఇనుము-ఇనుములాంటి హృదయముండాలి. ప్రజల కష్టాలు చూసి కరగకూడదు
ఈ-ఈతాకు-ఏ ఆకురాలినా ఈతాకు రాలదంటారు. జనం నంచి రాల్చుకోవాలే తప్ప, మనం పైసా కూడ రాల్చకూడదు
ఉ-ఉత్తుత్తి-ఉత్తుత్తి వాగ్ధానాల్లో ఆరితేరిపోవాలి
ఊ-ఊయల-జనం ఒక్కోసారి అరుస్తూ వుంటారు. అప్పుడు ఉన్నవి లేనివి చెప్పి ఊయలలో పెట్టి వూపాలి
ఎ-ఎలుక-రైతు పంట పండిస్తే ఎలుక తినేసినట్టు, జనం సొమ్మును తినేయాలి
ఏ-ఏలుబడి-ఎన్ని మాయోపాయాలు చేసైనా సరే ఏలుబడిలోవుండాలి.ఏలికలుగా వుంటేనే గౌరవం, లేకపోతే ఎలుక కూడ మనల్ని గౌరవించదు.
ఒ-ఒట్టు-మన పని జరిగేవరకూ ఎన్ని ఒట్లయినా పెట్టుకోవాలి. పనిపూర్తయితే ఒట్టు తీసి గట్టున పెట్టాలి. అధికారం వచ్చేవరకు ప్రత్యేకహోదా అని అరిచి ఆతరువాత ప్యాకేజీ అనడం దీనికి ఉదాహరణ
ఓ-ఓటు-ఇది అన్నిటికంటే ముఖ్యమైంది. నోట్లు ఇచ్చి దీన్ని కొనుక్కోవాలి. దొరికితే ఎదుటివాన్ని దొంగ అనాలి. దీనికోసం ఎన్ని అడ్డదార్లు తొక్కినా పరవాలేదు
ఒౌ-ఒౌషధం- దీన్ని తెలుగులో మందు అని కూడా అంటారు. మద్యనిషేధం ఎత్తేసి మందుకి గేట్లు తెరిచింది నేనే. జనం మత్తులో వుంటేనే మన ఎత్తులు పారేది
అం,అః-అమ్యామ్యా-ఎమ్మెల్యేగా వున్నప్పటి నుంచి నా మంత్రమిదే తినాలి, తినిపించాలి. బ్రీఫ్ డ్ మీ అనాలి. దొరికితే నేనే నిప్పు అని వాదించాలి.
Back to Top