చంద్రబాబూ...నువు స్లోనా ఏంటి??

నీసబ్బు స్లోనా ఏంటీ అంటూ వాణిజ్యప్రకటనల్లో చిన్నిపాప ఓ బుజ్జిబాబును అడిగినట్టే ఏపీ ప్రజలు చంద్రబాబును కూడా అడుగుతున్నారు. నువు మరీ ఇంతి స్లోనా ఏంటీ అని. ఇదేమీ చంద్రబాబు పరుగుపందెం పోటీ కాదు. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేస్తున్న టీడీపీ అధినేత తీరుపై వేస్తున్న సెటైర్. 
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోంచి ప్రకటిస్తున్న ప్రజా మేనిఫెస్టోను అమలు చేస్తూ ఎన్నికల స్టంటుకు తెరతీస్తున్నాడు చంద్రబాబు. నాలుగేళ్లుగా సంక్షేమ పాలనను కరకట్టలో పడుకోబెట్టి, నేడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు నోటివెంట వచ్చిన ప్రతిమాటనూ ఆచరిస్తున్న చంద్రబాబును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఎవరికి ఏ హామీ ప్రకటిస్తున్నాడో ఎదురుచూసి, దాన్ని తాను నెరవేర్చేసి మార్కులు కొట్టేయాలని తాపత్రయ పడుతున్నాడు.
పింఛన్లు రెండువేలకు పెంపు అని నవరత్నాల్లో జగన్ ప్రకటించారు. బాబు దాన్ని ఎన్నికలముందు అమలు చేసి నా పనికి కూలివ్వండి అని అడుగుతున్నాడు. ఆశా వర్కర్లకు, అంగన్ వాడీలకు జీతాలు పెంచుతామని ప్రతిపక్ష నేత పాదయాత్రలో హామీ ఇచ్చారు. నెల తిరక్కుండానే చంద్రబాబు వారి జీతాలు పెంచి, సన్మానం, అభినందన సభా అడిగిమరీ ఏర్పాటు చేయించుకున్నాడు. ట్రాక్టర్లకు, ఆటోలకు రోడ్డు పన్ను మినహాయింపు అని జగన్ తన మేనిఫెస్టోలో పెట్టారు. బాబుగారు దాన్ని ఎంచక్కా కాపీ కొట్టి పన్నురద్దు అంటూ ప్రకటనలో చెప్పుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆగదు అని ప్రకటించారు వైఎస్ జగన్. హోదా ఏమైనా సంజీవనా అన్ననోటితోనే ప్రత్యేకహోదాయే ప్రధానం అంటూ ఆరు నెలలుగా ధర్మపోరాట దీక్షల డ్రామా ఎత్తుకున్నాడు చంద్రబాబు. తెలుగుదేశం మేనిఫెస్టో వదిలేసి వైసీపీ మేనిఫెస్టో వెంటపడుతున్న ముఖ్యమంత్రిని చూసి తెలుగు తమ్ముళ్లు సిగ్గుతో చితికిపోతున్నారు. 
మొత్తానికి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతోనే  తన హామీలు నెరవేరేలా  చేస్తున్న వైఎస్ జగన్ నిజంగా అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేస్తాడో అని ప్రజలు గ్రహించేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడంటున్నారు...అయినా వైసీపీ మేనిఫెస్టో అమలు చేసి అందరి దగ్గరా క్రెడిట్ కొట్టేయాలనుకుంటే మరీ నాలుగేళ్లు ఆగాలా?? అదేదో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసుంటే ఇప్పుడీ కాపీరాయుడు పేరు వచ్చేది కాదు కదా!! బాబూ నువ్వు మరీ ఇంత స్లోనా ఏంటి...!!??!!
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top