బిజినెస్ మెన్ బాబు

కరెక్టే. బాబుగారు, బాబుగారి చినబాబు గారు ఏది చెప్పినా రైటే అయిఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర దేశం ఎందుకు కాకూడదు. పాలించేది తెలుగు దేశం అయినప్పుడు. పీడించబడేది అదే పాలించబడేది ఆంధ్రదేశం అయ్యుండచ్చు. వైయస్సార్ ప్రారంభించిన పథకాలన్నీ పేర్లు మార్చుకుని ఎన్టీఆర్ పేరు తగిలించుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్ కాస్తా తెలుగుదేశం పేరును చివర తగిలించుకుని కొత్తగా ఆంధ్రదేశంగా అవతరించవచ్చు. ఆంధ్రరాష్ట్రంలో అయితే ప్రతిపక్షం ఉంటుంది. ప్రశ్నిస్తుంది. ప్రజల తరఫున పోరాడుతుంది. అదే రాష్ట్రం అంతా తెలుగుదేశంగా మారిపోతే, ఏ గొడవా ఉండదు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అనంత దాకా అవినీతి, భూదంధాల గబ్బు ఘుమాయిస్తోంది. ఇక రాష్ట్రాన్నే తమ దేశం కింద మార్చేసుకుంటే మొత్తం టిడిపి ప్రాపర్టీ అయిపోతుంది. Ntr ట్రస్ట్ భవనం కాస్తా టిడిపి పార్టీ ఆఫీసు అయిపోయినట్టు అందరికి చెందిన రాష్ట్రం కాస్తా కొందరికే చెందిన దేశంలా మారిపోతుంది. తెలుగుదేశం అధ్యక్షుడు కోరుకున్నదే ఆయన పుత్రరత్నం చెబుతున్నాడు. నోరు జారడం ఆ చిన్నబాబుకు ఎప్పుడూ ఉన్న అలవాటే. అందరూ పప్పూ అంటున్నారుగాని, రాష్ట్రాన్ని దేశంగా మార్చగలిగే ఘనత కల పార్టీ బిడ్డను అంతకంటే ఎక్కువే పిలవాలేమో!

కంపెనీ అంటే ఏదో అనుకునేరు ఆంధ్రప్రదేశ్ కంపెనీయే. పప్పుబాబు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ. దానికి సిఇఓ బాబు. ఎమ్ డి చినబాబు. ఒకప్పుడు 9ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రరాష్ట్రాన్ని ఫక్తు కంపెనీగానే చూసాడు. విదేశాలకు it ఆఫీసులు చూపించి, వల్డ్ బ్యాంకు నుంచి కోట్లకు కోట్లు అప్పులు తెచ్చాడు. మళ్లీ వాటిని హైదరాబాద్ నగర నడిబొడ్డున, పార్కులు, చెరువుల చుట్టూ ఎమ్యూజిమెంట్ నెక్లెస్ లు నిర్మించాడు. సిఎమ్ అనే కంటే ఆంధ్రప్రదేశ్ సిఇవో అంటే తెగ సంబరపడిపోయాడు. పక్కా కమర్షియల్ వ్యాపార సూత్రాలతో 9ఏళ్లు ఆంధ్రా మర్చెంట్ లా పని చేసాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు అని సందేహం రావచ్చు. వ్యాపారులెప్పుడూ ఒకే రకంగా వ్యాపారం చేయరు. వ్యాపార సూత్రాలను కొత్తగా ఏర్పాటు చేసుకుంటారు. కొత్త కొత్త విధానాలతో వ్యాపారాన్ని మూడింతలు చేసుకుంటారు. అందుకే ఈ సారి బాబు కొత్త కొత్త ఆఫర్లతో వ్యాపారం సక్సెస్ చేసుకున్నాడు. రుణమాఫీ, స్పెషల్ స్టేటస్ స్కీములతో ఆంధ్రప్రదేశ్ జనాలను ఆకట్టుకున్నాడు. ప్రజల నమ్మకమే ఈ వ్యాపారి పెట్టుబడి. ఆంధ్రరాష్ట్రమే చంద్రబాబుకు్, ఆయన కుటుంబానికి వ్యాపారాల బడి. మరి ఆంధ్రప్రదేశ్ ను కంపెనీ అనే కదా అనాలి. అన్నట్టు మరిచిపోయాం నిన్నటిదాకా రాష్ట్రంలోని వనరులను, సహజ సంపదను మాత్రమే తాకట్టు పెట్టిన బాబు, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను పెట్టి కూడా అప్పులు పుట్టించాలని పథకాలు వేస్తున్నాడట. ఇక ఆంధ్రప్రదేశ్ కంపెనీలో మిగిలింది ప్రజలే. వీరిని ఎక్కడ తాకట్టు పెడతాడో…?

Back to Top