భజన చేసే విధము తెలియండీ....

 ఇన్నాళ్లుగా
పట్టించుకోలేదని ఫీలవ్వకండి. నాలుగేళ్లుగా మర్చిపోయినందుకు
కోపగించుకోకండి. ఇవిగో జీతాలు ఇప్పుడు పెంచేశాను. ఇక ప్రజల్లోకెళ్లి
మన ఢంకా భజాయించండి. నన్నుమించిన మనసున్న మారాజు లేడని ప్రచారం చేయండి. నేను
తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఎవ్వరూ చేయలేరని చెవులో ఇల్లు కట్టి పోరండి. మీ పెరిగిన
జీతాల పే స్లిప్పులను సాక్షంగా చూపండి...నాల్గేళ్లకైనా నాలుగువేలు జీతం
పెంచింనందుకు నా రుణం తీర్చుకోండి అంటున్నారు చంద్రబాబు.

విఆర్ఎలు
అంటేగ్రామ రెవెన్యూ సహాయకులతో నిర్వహించిన సభలో చంద్రబాబు పలుకులివి. ఇస్తినమ్మ
వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనంలా జీతాలు పెంచినందుకు ప్రతిగా ప్రచారం చేయమని కోరుతున్నారు
చంద్రబాబు. ప్రభుత్వోద్యోగులను పార్టీ అవసరాలకు, రాజకీయ
ప్రచారాలకూ ఇబ్బుడిముబ్బడిగా వాడేయడం చంద్రబాబుకు అలవాటు. కర్నాటక
ఎన్నికల్లో ఎపీఎన్జీవో సంఘం అధ్యక్షణ్ణి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయమని పంపాడు చంద్రబాబు. తన దొంగ
దీక్షలన్నిటికీ ఖచ్చితంగా వచ్చి అంటెండెన్స్ వేయించుకుని వెళ్లాలని హుకుం జారీ చేసాడు. ప్రభుత్వ
బస్సులు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు
వారూ వీరని లేదు. అందరినీ వాడేయడం బాబు నైజం. మొన్న అంగన్ వాడీలకు జీతాలు పెంచి
వారినీ ఇలాగే టిడిపి ప్రచార కార్యకర్తలు కావాలని ఆదేశించాడు చంద్రబాబు. గుర్రాలతో
తొక్కించిన సంగతులన్నీ మర్చిపోండి. ఇప్పుడు జీతాలు పెంచానుగా నాకు
ఓటేయని ఊరూరా చెప్పండి అంటున్నాడు.

ఇక
విఆర్ఎల సంగతి చూస్తే...పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎప్పుడో
విఆర్ఎల జీతం10500 చేసారు
కేసిఆర్. ఎన్నికల ముందు చంద్రబాబు విఆర్ఎలకు పే స్కేల్ వర్తింప చేస్తానని
హామీ ఇచ్చాడు. వేతనాన్ని 15000కు పెంచుతానన్నాడు. గుడ్డిగా
నమ్మిన ఆ ఉద్యోగులంతా చంద్రబాబుకు ఓటేశారు. నాలుగేళ్లుగా బాబుకు వినతులు చేసి, నిరసనలు
తెల్పి, దీక్షలకు కూడా దిగారు ఉద్యోగులు. చంద్రబాబు
వైఖరికి నిరసనగారాయలసీమలో78 రోజుల నిరవధిక సమ్మె గూడా చేసారు. అప్పటికీ
చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల సమయాన వేతనాలుపెంచి
పాత సంగతులు మర్చిపోండి. ఇప్పుడు నాకు ప్రచారం చేయండి అని
అడుగుతున్నాడు.

ప్రజా
సంకల్ప యాత్రలో పొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు
విఆర్ఎలు. పే స్కేలు అమలు పరుస్తానని వారికి జగన్ హామీ ఇచ్చారు. ఇది జరిగి
దాదాపు ఆరు నెలలు కావొస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు నిండా ఏడాది
సమయం కూడా లేదు. బాబు తన స్టేటజీకి పదును పెట్టాడు. పేస్కేలు
ప్రకారం15000 చేస్తానన్న
వేతనాన్ని10500 చేసి
చేతులు దులుపుకున్నాడు. ఇందుకు ప్రతిగా తనకూ, ప్రభుత్వానికీ
అండగా నిలవాలని కోరుకున్నాడు.

ఇన్నేళ్లుగా
తమని పట్టించుకోని చంద్రబాబుకు ఉన్నట్టుండి ఇంత ప్రేమ పుట్టుకు రావడానికి గల కారణాలు
ఆ ఉద్యోగులకు తెలియక కాదు. కనీస వేతనం లేక అల్లాడిపోతున్న
తమ అవసరాలను చంద్రబాబు తన స్వార్థం కోసం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకుంటున్నాడని అర్థం
కాక కాదు. కానీ ఇది తమ వ్యతిరేకతను తెలియజేసే సందర్భం కాదు కనుక వారు
మిన్నకుంటున్నారు. అయినాప్రభుత్వంపై నిన్నటి వరకూ పోరాటం
చేసిన అధికారులు, ఉన్నట్టుండి ఆ ప్రభుత్వాన్నే వెనకేసుకొస్తే స్థానికంగా వ్యతిరేకత
ఎదురవ్వడం ఖాయం. వేతనాలు పెంచినా, వినతులు చేసినా బాబు చేసిన ద్రోహాలను
ఏ వర్గమూ మరిచిపోయే సమస్యే లేదు. అధికారులు, ఉద్యోగులు
బాబు భజన చేస్తే విని అవుననే అమాయకులూ లేరు. ఈ విషయం చంద్రబాబుకు ఎప్పటికి
అర్థం అవుతుందో???!!

Back to Top