మెలుకువకు నిద్దరుకూ మధ్యగుడ్డోడు కర్ర అడ్డం పెడితే బుడ్డోడు ఎగిరి దూకాడుట. చంద్రబాబు తెల్లవార్లూ తొంగోకుండా కూకుంటే జరిగే ప్రమాదాలు జరక్కుండా ఆగుతాయా అంటూ గయ్యమన్నాడో పల్లెటూరి పెద్దాయన. 
మరి ముఖ్యమంత్రి అంతటోడు కళ్లలో ఒత్తులేస్కొని, రెప్పల మధ్య దుంగలు పెట్టుకుని మరీ నిద్దర లేకుండా రేతిరంతా జాగారం చేస్తుంటే అధికారులు ఆ మాత్రం మత్తు వదలించుకోకుండా ఉంటారా అని ఇంకో ఆయన దీర్ఘం తీశాడు.
అధికారులకు ఆ మత్తే వదిలితే ఈమాటీ పడవ బోల్తా జరిగేదా? ఇంత మంది గంగపాలయ్యేవాళ్లా మళ్లీ గుర్రుమన్నాడు మొదటాయిన.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, ప్రాణాలు పోయాక జాగారం చేసి ప్రయోజనమాంగతం నుంచి గుణపాఠం నేర్చుకోవద్దూంముందు పోయిన ప్రాణాలకైనా మర్యాదుండద్దూంఏడాదికి ఒకటో రెండో నీళ్ల గండాలు రాష్ట్రానికి పడుతూనే ఉన్నాయి. వివరంగా చూస్తే అన్నిటి ఎనకా ఆ ముఖ్యమంత్రి మాత్రమే కనబడుతున్నాడు అన్నాడు చింత చెట్టుకింద చిన్నాయన చిరాకు పడుతూ...
అన్నిటికీ ఆబాబోర్నే అంటే ఎల్లాగే కాస్త తర్కం మాట్టాడాడు ఓ తలపాగా పెద్దాయన.

అప్పుడు గోదావరి పుష్కరాలకి, షూటింగుల కోసం జనాల్ని కుక్కేసి, తొక్కేసి సంపేసారు. ఆనక మొన్న విజయవాడలో, టూరిజం పేరెట్టి లైసెన్సులు లేని బోట్లను విపరీతంగా తిప్పేసి ముసలోళ్లని అన్యాయంగా నీళ్లలో ముంచేసారు. ఇవాళ ఇదిగో మళ్లీ ఇలాగం..
.రోడ్డు మీద పర్మిట్ లేని లారీలు కనబడితే పోలీసోళ్లు పట్టుకుని పెనాల్టీలేయట్లాంమరి నీళ్లలో తిరిగే బోటుకు లైసెన్సు, అది లేకపోతే ఆటిని తిరగనీకూడదన సెన్సు ఆ అధికార్లకు ఉండొద్దా? రేపేదైనా అయితే జనాలకి, పై అధికారులకి, ముఖ్యమంత్రికి సమాధానం చెప్పుకోవాలనే భయం ఆళ్లకేదన్నా ఉందా అని? అసలు మొన్నటి ఇబ్రహీం పట్నం ఫెర్రీ బోటు ప్రమాదానికి కారణం అయిన అధికారుల మీద ఏదన్నా యాక్షన్ తీసుకున్నారా? ఆ ప్రైవేటు కంపెనీ వాళ్ల మీద కేసైనా పెట్టారా? ఏమీ లేదుంఅన్నిటికీ ఓ కమిటీ అంటాడు చంద్రబాబుంఅవన్నీ ఏ గంగలో కలుస్తున్నాయో ఎవ్వుడికీ తెలీదు ఆగ్రహంతో ఊగిపోయాడు పట్నంలో చదువుకుని వచ్చిన ఓ కుర్రోడు. 

ముఖ్యమంత్రి పగలంతా పడుకున్నా, తెల్లార్లూ మేలుకొనిఉన్నా పరిపాలన సవ్యంగా ఉండాలి. పూటకో మీటింగు, రోజుకో కాన్ఫరెన్స్, గ్రీవెన్స్ మీటింగ్ హాలు, డాష్ బోర్డు సిఎమ్, టెక్నాలజీకి తాత అని తాటికాయంత అక్షరాలతో రాయించుకుంటే సరిపోతుందా? జరిగే ప్రమాదాలను అరికట్టడానికి అధికారును అప్రమత్తం చేయద్దా? వారి పనితీరు పై మార్కులేయడమేనా, నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవద్దా? ప్రమాదాలకు కారణమైన అధికారులు, వ్యక్తులకు శిక్ష పడొద్దా? ? సమాచార వ్యవస్థ మెరుగుపడాలని ముఖ్యమంత్రే స్వయంగా అనడానికి సిగ్గేయడం లేదా?  టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రభుత్వం గురించి, పార్టీ గురించి ప్రచారం చేసుకోవడమేనా ప్రమాదాలు జరక్కుండా ఆ సాంకేతికతను ఉపయోగించక్కర్లేదా పెద్దోళ్ల చర్చల్లో కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. 
Back to Top