వంచన @ 40తెలుగులో కొన్ని మాటలకు చంద్రబాబు పర్యాయ పదం అయిపోయారు. 
మోసం అంటే బాబు చేసేది. 
వంచన అంటే బాబు వ్యవహారం. 
కపటత్వం అంటే బాబు వ్యక్తిత్వం. 
వెన్నుపోటు అంటే చంద్రబాబు ఆయన మామ ఎన్టీఆర్ కు పొడిచినది. 
నక్కజిత్తులు అంటే నారా వేసే ఎత్తులు. 
రెండు నాల్కలంటే బాబు నోట్లో ఉండేవి.
ఊసరవెల్లి అంటే చంద్రబాబు తీరు
అబద్ధాలు అంటే చంద్రబాబు మేనిఫెస్టో
గోడ మీద పిల్లి అంటే చంద్రబాబు నైజం
యూజ్ అండ్ త్రో, కరివేపాకు సిద్ధాంతాలకు మారు పేరు బాబు
రెండు కళ్ల పాలసీ.....

 ఇలా  చెప్పుకుంటూ పోతే తెలుగు నిఘంటువులో ఇంకా ఎన్నిటికి బాబు పేరు చేర్చాలో అని రాజకీయ పండితులు జుట్టు పీక్కుంటారు. 
బాబు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ రంగానికి అంటువ్యాధి అంటుకుంది. మాటలతో మామ పంచన చేరి, వంచన తో తెలుగుదేశం పార్టీని ఆక్రమించుకున్నప్పుడే రాష్ట్రానికి పచ్చ జాఢ్యం పట్టుకుంది. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు పన్నని కుట్రలేదు. చేయని కుతంత్రం లేదు. ఆడని అబద్ధం లేదు. ఈవిధంగా సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ బాబు తన మోసపూరిత, దగాకోరు, దౌర్జన్య పర్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. చంద్రమండలానికెళ్లిన చంద్రుడు, ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని దించిన ఇంద్రుడు అంటూ బాజా భజంత్రీలతో పొగిడే ఓ బ్యాండు మేళం కూడా ఉంది బాబు గార్కి. ఆ బృందం పనల్లా బాబు ఏం చేసినా భేష్ అనడం, ఏమీ  చేయకపోయినా భుజాలకెత్తుకోవడం. ఆయన్నే కాదు ఆయనగారి పుత్ర వారసత్వాన్ని కూడా పరిపరి విధాల పొగడడమే ఆ బృందం ఒప్పందం. 

40 ఏళ్ల వంచనకు సన్మానం

రాష్ట్ర రాజకీయాలను డబ్బు మయం చేయడం చంద్రబాబుతోనే మొదలైందంటారు కొందరు రాజకీయవేత్తలు. ఇక బాబు రాజకీయ జీవితం ఆరంభమే అవినీతికి పునాది వేసిందని కూడా అభిప్రాయపడతారు. ప్రజాబలంతో కాకుండా అవకాశవాదంతో రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం. అధికారమే పరమావధిగా ఎంతటి నీచానికైనా దిగజారడం ఆయన సిద్ధాంతం. ఓటు కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పడం, ఆ ఓటుకు నోట్లిచ్చి దొరికిపోయినా అడ్డంగా బొంకడం బాబుకు సర్వసాధారణం. 
ఈ అత్యధ్బుతమైన లక్షణాలున్నఅతి అరుదైన వ్యక్తిత్వానికి, మోసపూరిత వెన్నుపోటు రాజకీయ జీవితానికే తోకాడిస్తూ సన్మాన పత్రాలు చదువుతున్నాయి ఎల్లో మీడియా గురివిందలు.  
Back to Top