బెల్టు షాపులో బెల్టు లేదు


మంత్రి లోకేష్ విలేకరులు సమావేశానికి వచ్చి కూర్చున్నాడు. సమావేశం మెదలైంది. 
అడగండి అన్నాడు చినబాబు విలేకరులను ఉద్దేశించి.
సర్ బెల్ట్ షాపులు అడగబోయాడు ఓ విలేకరి పెన్ను పైకెత్తి…
నీదే పత్రిక అడిగాడు పప్పూ కోపంగా
ఎందుకు సర్ ప్రశ్న అడిగిన విలేకరి మళ్లీ ప్రశ్నించాడు..
ఎల్లో పేపర్స్ కి తప్ప ఇంకో కలర్ కి ఆన్సర్ చేయొద్దన్నారు నాన్నారు అన్నాడు పప్పు బుద్ధిమంతుడిలా…
కాదు సర్…పచారీ కొట్లలోనూ మందు దొరుకుతోంది కదా మళ్లీ వదలకుండా అడిగాడు విలేకరి.
ఇదంతా మీరు చేస్తున్న కుట్ర, ఫాల్స్ ప్రచారం. ఇన్ని చోట్ల పర్యటిస్తున్నాను…నాకెక్కడా ఫిర్యాదులు అందలేదు
అన్నాడు పప్పు బింకంగా.
అదేంటి సార్… మహిళలంతా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసారు కదా. బెల్టు షాపులు మూయించమని, ఇళ్ల మద్య
మద్యం దుకాణాలు తీయించమని చీపుళ్లు చేటలతో ఏకేసారు కదా…అడిగాడు ఇంకో విలేకరి…
ఏది ఉంటే నాకు ఫ్రూఫ్ చూపించండి…లాయర్ లా లాపాయింట్ తీసినందుకు ఆనందపడిపోతూ అడిగాడు పప్పూ.
ముఖాలు చూసుకున్నారు విలేకరులు. ఇక ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ రాదని వాళ్లకి అర్థం అయిపోయింది. మరో
ప్రశ్నలోకి వెళ్లారు.
జన్మభూమి కమిటీల గురించి విమర్శలు వస్తున్నాయి కదా..వాటిపై మీ స్పందన ఏమిటి అడిగాడు విలేకరి.
జన్మభూమి కమిటీల వల్ల నాకు, నాన్నకి, తాతయ్యకి, మా పార్టీకి, మా ప్రభుత్వానికి, రాష్ట్రాని, ఆంధ్రప్రదేశ్ దేశానికి
చెప్పుకుంటూ పోతున్నాడు పప్పు…
సార్ ఆన్సర్ చెప్పండి సార్ అసహనంతో అరిచాడో విలేకరి.

అదే చెబుతున్నాను ఉండడీ…మీకు తొందరెక్కువ…జన్మభూమి కమిటీల వల్ల చెడ్డపేరు వస్తున్న మాట వాస్తవమే
అంటున్నాను…అని నిజాయితీగా ఒప్పుకున్నాడు పప్పుబాబు.
మరిప్పుడు ఏం చేయబోతున్నారు అడిగాడు మరో విలేకరి.
అన్ని కమిటీలు చెడ్డవి కావు. చెడ్డ కమిటీలు కూడా అన్నిసార్లూ చెడ్డవి కావు. ఇప్పుడు మంచివైనవి, తర్వాత చెడ్డ
కావచ్చేమో…ఎవరు చెప్పగలరు…ఏమైనా సరే కమిటీలను ప్రక్షాళన చేస్తాం అన్నాడు ఆవేశంగా…
పేపరు మీద ఏం బరుక్కోవాలో తెలీక విలేకర్లు పెన్నుతో బుర్ర గీక్కున్నారు.
మళ్లీ తనే అందుకున్నాడు పప్పు- ఫైబర్ గ్రిడ్ ద్వారా త్వరలోనే ఇంటింటికీ కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్
మెదలుపెడతాం. పచ్చని వార్తలు, పచ్చపచ్చ ప్రసారాలతో ఇల్లిల్లూ కలకల లాడుతుంది…ఆ సీన్ ని
ఊహిస్తూ…ఆకాశంలోకి చూస్తూ కళ్లల్లో ఆనందం చిమ్ముతుండగా చెప్పాడు చినబాబు…
వదిలేస్తే ఇంకేం ఊహించుకుంటాడో అని భయపడ్డ విలేకరులు, చినబాబుని ఇంకో ప్రశ్నతో భూమ్మీదకు తీసుకొచ్చారు.
గతంలో మీరు ఇళ్ల పన్నులు రద్దు చేస్తామన్నారు అని అడిగాడో విలేకరి.
ఏంటయ్యా అన్నీ పెద్ద మీకే గుర్తున్నట్టు…నే చెప్పిందాట్లో మీకు సగం గుర్తుంటుంది…సగం మర్చిపోతారు…నేను పన్ను
పీకేస్తా అనలేదు…సారి పన్ను రద్దు చేస్తా అన్లేదు…తగ్గిస్తా అన్నాను…అన్నాడు ఉక్రోషాన్ని తమాయించుకుంటూ…
మరి మూడు లక్షల ఐటి ఉద్యోగాలు…మరో పెన్ను పైకి లేచి అడిగింది…
నోనోనో…లక్ష ఐటి…2లక్షలు ఎలక్ట్రానిక్స్ లో అన్నాను…సరి చేసాడు చినబాబు…
పోనీ అవెప్పుడిస్తారో చెప్పండి చిరాగ్గా అడిగాడు విలేకరి…
నాన్నని అడిగి చెబుతా బై అని లేచెళ్లిపోయాడు పప్పు…


Back to Top