బాలకృష్ణ స్పెషాలిటీ

నందమూరి బాలకృష్ణ నంద్యాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు. ఒక అభిమాని సెల్ఫీకి ప్రయత్నించాడు. అతని చెంప పగిలిపోయింది. పార్టీ కార్యకర్తలొచ్చి ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు. 
‘అందేంటి సార్, అలా కొట్టారు.’ అని అడిగారు విలేకరులు
‘కట్టె కొట్టె తెచ్చే అంటే రామాయణం, అట, పాట, వేట అంటే మహాభారత, ఒకసారి చరిత్రని చూసినట్లయితే కళ్ల ముందు కనిపిస్తాయి’ అని ర్థం పర్ధం లేకుండా మాట్లాడాడు. బాలకృష్ణ.
‘మేం అడిగిందేమిటి, మీరు చెప్పిందేమిటి?’ ఆశ్చర్యంగా అడిగారు విలేకరులు ‘అడిగిందే చెబుతేం, చెప్పిందే అడగండి’
ఈలోగా ఒక అభిమాని దండ వేయడానికి ప్రయత్నించాడు, సినిమా స్టయిల్లో నాలుగు పిడిగుద్దులు గుద్దాడు. వాడు గ్రాఫిక్స్‌ లెవల్లో గాల్లోకి ఎగిరాడు. 
‘సినిమాల్లో ఫైట్స్‌ చేసేవాడే హీరోకాదు, బయటకూడా జనాల్ని తన్నాలి’ అన్నాడు బాలకృష్ణ.
‘మీ బావ చంద్రబాబు కనపడకుండా తంతారు. మీరు కనిపించేలా తంతారు. అంతే తేడా’
‘తెలుగు దేశానికి ఓటేసినందుకు తన్నులు తినాలి మరి. అందరూ క్రరతో కొడితే, నేను కంటి చూపుతో కొడతా’ కోపంగా చూసాడు బాలకృష్ణ. విలేకరులు భయంగా చూసారు. 
‘ఇంతకూ ఏం చెప్పాలనుకుంటున్నారు?’ అడిగారు విలేకరులు
‘నేను నోటితో చెప్పను. చేత్తోనే చెపుతా. మాకు ఓటు వేయకపోతే ఫైట్‌ మాస్టర్లని పెట్టి ఓటర్లను తన్నిస్తా’
‘మీకు ఓటు ఎందుకు వేయాలి?’
‘మాది విలువలున్న పార్టీ. అవతలవున్నది వెన్నుపోటుదారులు కాబట్టి’
‘వెన్నుపోటు అనే పదానికి పేటెంట్‌రైట్స్‌ మీ బావగారిది. తెలుగులో ఎక్కడ ఎవరు వెన్నుపోటు అనే పదాన్ని పలికినా, రాసినా, బాబుగారికి రాయల్టీ చెల్లించాలి’ ఆ మాట అనగానే ఒక క్రర తీసుకుని విలేకరి వెంటపడ్డాడు బాలకృష్ణ. ఆయన పారిపోయాడు. 
‘ఇంకా ఏమైనా అడుగుతారా?’ అడిగాడు బాలకృష్ణ. 
‘మీ మానసికస్థితిపై మాకు భయంగా ఉంది. నేను వేసిన రోడ్లపై తిరగకండి అని బాబు బెదిరిస్తాడు. లోకేష్‌ ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. మీరేమో జనాల చెంపలు పగులగొడతారు.’
‘జనాన్ని కొట్టకపోతే ఇక అధికారమెందుకు?’ అన్నాడు బాలకృష్ణ. 
‘మీ బావగారు పొట్టమీద కొడతారు. మీరేమో చెంపమీద కొడతారు. దీనికి ప్రతికారాన్ని ఓటర్లు బ్యాలెట్‌ని గుద్ది మరి తీర్చుకుంటారు. నంద్యాలలో వార్‌ వన్‌సైడ్‌ సార్‌. జనం ఎప్పుడో డిజైడ్‌ అయ్యారు’ అన్నారు విలేకరులు
Back to Top