బాహుబ‌లి లో ప్ర‌భాస్ మాదిరి అరిచేది ఎవ‌రు..!

``నేనెవ‌ర్ని?`` బాహుబ‌లిలో ప్ర‌భాస్‌లా అరిచాడు చంద్ర‌బాబు
``వెన్నుపోటు తిని నేల‌కొరిగిన ఎన్టీయార్ అల్లుడివి, రాష్ట్ర ప్ర‌జ‌ల్ని ముంచ‌డానికి వ‌చ్చిన సునామిని`` చెప్పాడు పిఏ
``పొగుడుతున్నావా, తిడుతున్నావా?`` అనుమానంగా అడిగాడు బాబు
`` తిట్టుకి పొగ‌డ్త‌కి తెలుసుకునే స్థితి మీరెప్పుడో దాటిపోయారు``
``అయితే ఓకే, ఇప్పుడు చెప్పు నేనెవ‌ర్ని?``
`` ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక‌య్యి మునిగిపోతారో అత‌నే మీరు``
``ప్ర‌తి దానికీ ఈ మునిగిపోవ‌డం ఎందుకు యాడ్ చేస్తున్నావు``
``మీ వ‌ల్లే క‌దా పుష్క‌రాల్లో జ‌నం మునిగారు. శ‌వాలై తేలారు``
``మున‌క అనే ప‌దం లేకుండా చెప్పు నేనెవ‌ర్ని?``
`` ఎవ‌రు కాలుపెడితే క‌రువు వ‌స్తుందో, ఎవ‌రి పాదం సొకితే వాన చుక్క ప‌డ‌దో, ఎవ‌రి పాల‌న‌లో రైతులు మునిగిపోతారో వాళ్ళే మీరు``
`` మ‌ళ్ళీ మునిగిపోతారు అంటున్నావు`` కోపంగా అడిగాడు బాబు
``అదేంటో సార్‌, ఎంత ప్ర‌య‌త్నించినా మున‌క అనేది లేకుండా మీ గురించి చెప్ప‌లేక‌పోతున్నాను`` అన్నాడు పిఏ
`` ఒళ్ళు ద‌గ్గ‌ర పెట్టుకుని చెప్ప నేనెవ‌ర్ని?``
``ఒక‌ప్పుడు కాంగ్రెస్ నాయ‌కుడివి, త‌రువాత దాన్ని ముంచేసి ఎన్టీయార్ వైపు చేరారు. ఎన్టీయార్‌ని ముంచేసి ముఖ్య‌మంత్రియ్యారు``
``పుష్క‌ర మ‌హిమ వ‌ల్ల నువ్వు మున‌క నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా లేవు, స‌రే నీ ఇష్టం. ముంచ‌డం నా హాబీ, బాధ్య‌త‌, విధి. ఇప్పుడు చెప్పు నేనెవ‌ర్ని?``
``మీరెవ‌రో చంద్ర‌గిరిలో, కుప్పంలో అడిగితే చెబుతారు మ‌ధ్య‌లో న‌న్నెందుకు సార్ చంపుతున్నారు``
``డొంక తిరుగుడొద్దు, నేనెవ‌ర్ని?``
`` రెండెక‌రాల నుంచి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు. మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన‌వాళ్ళు. ఏడాది నుంచి అబ‌ద్ధాల‌తో కాలం గ‌డుపుతున్న‌వాళ్ళు, ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేవాళ్ళు చాలా ఇంకా కావాలా?``
`` చాల‌లేదు, నేనెవ‌ర్ని?``
``జ‌నం సొమ్ముతో విదేశాలు తిరుగుతున్న వాళ్ళు, రాజ‌ధాని నిర్మాణం పేరుతో టైం పాస్ చేస్తున్న‌వాళ్ళు``
``నేనెవ‌ర్ని?``
``తెలియ‌దు. మ‌హాప్ర‌భు.., మీరే చెప్పండి``
``క‌ళ్ళ ముందే తొక్కిస‌లాట‌లో జ‌నం చ‌చ్చిపోతూవుంటే నింపాదిగా న‌డిచి వెళ్ళిన‌వాన్ని``
అదండీ అసలు మ్యాట‌ర్‌..!

- రాహుల్
Back to Top