బాబు ప్రకృతి వ్యవసాయానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి...

 

ప్రకృతి వ్యవసాయం గురించి
మాట్లాడటానికి చంద్రబాబు అమెరికా వెళ్లాడని కబుర్లు చెబుతున్నారు పచ్చపార్టీ నేతలు. అసలు వ్యవసాయం గురించి
చంద్రబాబు మాట్లాడటమే వింత అనుకుంటుంటే అందులోనూ ప్రకృతి వ్యవసాయం, సుస్థిర ఆర్థిక వ్యవస్థ
గురించి ప్రసంగం ఇవ్వడం మరీ విడ్డూరం. ఇక అమెరికాలో పెట్టుబడుల కోసం వ్యాపార వాణిజ్య ప్రముఖులతో
బాబు మంతనాలు సరేసరి. ఈసారి బాబుగారు వి-రిసార్ట్ అనే సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ప్రకృతి వ్యవసాయాన్ని
ప్రతిబింబించేలా రిసార్టు ఏర్పాటు చేయాలని వారిని కోరారట. ఇదీ బాబుగారు చేసే వ్యవసాయం. కార్పొరేట్ సంస్థలకు
వేలాది ఎకరాలు కట్టబెట్టేందుకు, కమీషన్లు అందుకునేందుకు వేసే ప్లాన్లకు రైతుల పేరు, వ్యవసాయం పేరు తగిలించుకోవడం
చంద్రబాబు అలవాటు. వేదికల మీద ప్రసంగాలు రైతుల గురించి చేస్తాడు చంద్రబాబు. కాని పరిపాలనలో ప్రయోజనాలు
మాత్రం బడాబాబులకు, కార్పొరేట్ కంపెనీలకు లభించేలా చేస్తాడు. రాజధాని భూములను కారుచౌకగా కట్టబెడుతున్నది వారికే. మహానగరాల్లో కొండలు
గుట్టలు ధారాదత్తం చేసిందీ వారికే. ఇంతవరకూ బాబుగారు భూములు పంచిపెట్టిన ఐటికంపెనీలు, పరిశ్రమలు,  ఫైస్టార్ హోటళ్లు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేటు స్కూళ్లు ఏవీ
ఒక్క ఇటుకైనా వేయలేదు. వచ్చిన ఒకటి రెండు కంపెనీలు ముందు ప్రతిపాదించిన స్థాయిలో
ఉద్యోగాలు కానీ, ఫలితాలను కానీ చూపించడం లేదని కాగ్ గడ్డిపెట్టింది. స్టార్టప్ లకోసం వేలాది
ఎకరాలను రాసిచ్చేముందు వాటికా సత్తా ఉందో లేదో చూడాలని చివాట్లు వేసింది.

వ్యవసాయరంగానికి సాయం
చేయడం అంటే రైతు బొమ్మను ముద్రేసి మార్కెటింగ్ చేసుకోవడమా? రిసార్టుల్లో ప్రకృతి
వ్యవసాయాన్ని ప్రతిబింబించేలా నిర్మిస్తే రైతులకు మేలు జరుగుతుందా? బిల్ గేట్స్ ను
పిలిచి అగ్రిటెక్ అంటూ ఈవెంట్లు జరిపితే ప్రకృతి వ్యవసాయం గురించి రైతుల్లో అవగాహన పెరుగుతుందా? సమయానికి నీరు, ఎరువులు, విత్తనాలు, రుణాలు ఏవీ అందించకుండా, సబ్సిడీలు ఇవ్వకుండా, మద్దతు ధరమాటెత్తకుండా
అన్నదాతలకు అంత చేసాం, వ్యవసాయానికి ఇంత చేసాం అని చెప్పుకునే ముఖ్యమంత్రి
బహుసా చంద్రబాబు ఒక్కడేనేమో?? రిసార్టుల్లో ప్రకృతి వ్యవసాయం అనే సూత్రాన్ని చూసి
అంతర్జాతీయ స్థాయిలో బాబుకు రేపు నోబెల్ ప్రైజ్ వచ్చినా వస్తుంది!!! కాదనేదెవరు? 

Back to Top