వెరైటీగా చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం

``
క‌ల్తీ మ‌ద్యం వ‌ల్ల
జ‌నం చ‌నిపోతున్నారు. దీనికి మీ స‌మాధాన‌మేంటి?`` అడిగారు విలేక‌రులు

 చావు పుట్టుక‌లు ఎవ‌రి చేతుల్లోనూ లేవు. చ‌చ్చేదెవ‌డు
చంపేదెవ‌డు అన్నాడు భ‌గ‌వ‌ద్గీత‌లో శ్రీ‌కృష్ణుడు.  వాళ్ళ‌కు టైమొచ్చింది పోయారు. మ‌న‌కి టైమొస్తే మ‌నం
పోతాం. ఇక క‌ల్తీ అంటారా,
మా పార్టీనే
పెద్ద క‌ల్తీ పార్టీ..  ఎన్టీయార్ పెట్టిన
పార్టీలోకి నేను దూరి క‌ల్తీ చేసాను. ఈ రాష్ట్రాన్ని క‌ల్తీ పార్టీనే పాలిస్తున్న‌పుడు
ఇక క‌ల్తీ మ‌ద్యం ఒక లెక్కేమిటి?`` అన్నాడు బాబు

``
అంటే మీ బాధ్య‌తేమీ
లేదా?``

``
మాది బాధ్య‌త గల
పార్టీ అందువల్ల విచార‌ణ జ‌రిపిస్తాం క‌ల్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ నేత కాబ‌ట్టి
తాట‌తీస్తాం ఈ దేశం పాడైపోయింది కాంగ్రెస్ వ‌ల్లే``

``
మీరు కూడా ఒక‌ప్పుడు
కాంగ్రెస్ పార్టీనే క‌దా!``

``అదంతా గ‌తం ఒక‌ప్పుడు నేను రెండెక‌రాల రైతుని
ఇప్పుడు వేల‌కోట్ల అధిప‌తిని అందువ‌ల్ల గ‌తాన్ని గుర్తుంచుకునేవాడు పుట్ట‌గ‌తులు
లేకుండా పోతాడు``

``
జ‌నాల తాగుడుపై
 ప్ర‌భుత్వాలు డ‌బ్బు సంపాదించ‌డం న్యాయ‌మేనా?``

``
రాజ‌కీయాల్లో
న్యాయాలు,అన్యాయాలు వుండవు. మ‌న‌కు అనుకూల‌మైంది న్యాయం.
మ‌న‌కు న‌ష్టం చేకూర్చేది అన్యాయం. ఎన్టీయార్ పెట్టిన మ‌ద్య‌నిషేదాన్ని చావ‌గొట్టి
చెవులు మూసి మ‌ళ్ళీ మ‌ద్యాన్ని అంద‌రికీ అందుబాటులోకి తెచ్చాను. ఎందుకంటే జ‌నం
తాగినా చ‌చ్చిపోతారు,
తాగ‌క‌పోయినా చ‌చ్చిపోతారు.
నేను అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ‌చ్చేవి క‌ష్టాలే కాబ‌ట్టి, ముంద‌స్తు చ‌ర్య‌గా క‌ష్టాల్ని త‌ట్టుకునే శ‌క్తి
వుండ‌డానికి మ‌ళ్ళీ మ‌ద్యానికి త‌లుపులు తెరిచాను.

 తాగ‌డం వ‌ల్ల భ్రాంతి  క‌లుగుతుంది.
భ్రాంతి వ‌ల్ల మ‌న‌శ్శాంతి లభిస్తుంది. తాగినంత‌సేపు ప్ర‌జ‌ల్ని సుఖంగా వుంచ‌డం మా
ప్ర‌భుత్వం బాధ్య‌త అయితే మా   అధికారులు క‌ళ్ళ మూసుకోవ‌డం వ‌ల్ల ఒక్కోసారి ప్ర‌జ‌ల‌కి
ఎక్కువ భ్రాంతి క‌లిగి మైకంలోనే కైలాసానికి చేరుకుంటారు. ఒక ర‌కంగా ఇది సుఖ మ‌ర‌ణం
ప్ర‌జ‌ల‌కు మంచి మ‌ర‌ణం ప్ర‌సాదించ‌డం మా క‌ర్త‌వ్యం``

``అయితే చ‌చ్చిపోయింది మ‌ద్యం వ‌ల్ల కాదంటారా?``

``
మీరు నా పాయింట్
అర్థం చేసుకోవ‌డం లేదు. మ‌ద్యం ఈ నాటిదికాదు. దానికి పురాణ‌ చ‌రిత్ర‌వుంది. దేవ‌త‌లు
సుర‌ తాగేవాళ్ళు అది చాల‌ద‌ని స‌ముద్రాన్ని మ‌ధించి అమృతాన్ని తెచ్చారు. అమృత మంటే
మ‌రేంటో కాదు, మందే.. అది తాగ‌డం వ‌ల్లే వాళ్ళ‌కి స్వ‌ర్గం అభించింది. మందు ద‌క్క‌లేద‌న్న
క‌సితో రాక్ష‌సులు మ‌రింత రాక్ష‌సుల‌య్యారు. అందువ‌ల్ల మ‌నుషులు మ‌నుషుల్లా వుండాలంటే
మందు అవ‌స‌రం. ఎన్నిక‌ల్లో మ‌ద్యం సంస్కృతికి ఆద్యుడు నేనే. ఎందుకంటే మైకంలో ఓటేయ‌డం
వ‌ల్ల బాధ తెలియ‌దు. మెల‌కువ వ‌చ్చేస‌రికి ప్ర‌జాస్వామ్యం క‌ళ్ళ‌కు క‌నిపిస్తూవుంటుంది``

``
ప్ర‌తిదానికి మీరు
ఇలా సిద్ధాంతాన్ని మాట్లాడుతారు!``

``సిద్ధాంతం, రాద్ధాంతం, వేదాంతం ఇవ‌న్నీ తెలియ‌డం వ‌ల్లే అల్లుడుగా
చేరిన నేను ద‌శ‌మ‌ గ్ర‌హంగా మారాను. ఈ రాష్ట్రానికి దుష్ట గ్ర‌హంగా త‌యార‌య్యాను, క‌ల్తీ ముఖ్య‌మంత్రే వున్న‌ప్పుడు క‌ల్తీ మ‌ద్యం
గురించి ఆలోచ‌న అనవ‌స‌రం.

 

Back to Top