లోకేష్ కి ఓనమాలు

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత లోకేష్ చంద్రబాబు దగ్గరికొచ్చాడు
రాజకీయాలు తెలియని నన్ను మంత్రిని చేసారు. మంత్రిగా నేనేం చేయాలో కూడా మీరే చెప్పండి?
మనవి మొదట్నుంచి జిత్తులమారి రాజకీయాలే తప్ప, జనం బలంతో చేసే రాజకీయాలు కావు. అందువల్ల మొదట నువ్వు నక్కజిత్తులు నేర్చుకోవాలి అన్నాడు బాబు
నక్కంటే అడిగాడు లోకేష్
నీకు తెలుగురాదు, నాకు ఇంగ్లీష్ రాదు. ఇదో సమస్య . నక్కంటే ఫాక్స్
ఓహో అర్థమైంది. అయితే ఒక ఫాక్స్ ని తెచ్చి పెంచుకుందామా?
రాజకీయాల్లో ఫాక్స్ లు తెచ్చుకోనక్కర్లేదు. మన చుట్టూ వుంటాయి. మనమే ఫాక్స్ లకు ఫాక్స్ లం
అంటే నక్కలకి నక్కలం. నక్కజిత్తులు అంటే ఏంటో చెప్పండి?
నక్కజిత్తులు అంటే మామకి సవాల్ చేసి ఆయన పార్టీ గెలవగానే గుట్టుచప్పుడు కాకుండా తెలుగుదేశంలో దూరిపోవడం. అవకాశం దొరకగానే వెన్నుపోటు పొడవడం. మీ పెదనాన్న వెంకటేశ్వరరావుని ఉపముఖ్యమంత్రి చేస్తానని వుచ్చులోకి లాగడం, మీమామ హరికృష్ణని అవసరానికి వాడుకొని వదిలేయడం అన్నాడు బాబు
అంతేనా జూనియర్ ఎన్టీఆర్  విషయం మరిచారు అన్నాడు లోకేష్
పాపం ఎన్టీఆర్ నీకు పోటీగా పార్టీలో ఎదగాలనుకున్నాడు. ప్రచారం వరకూ వాడుకొని అవతలకి నెట్టేసా. రాజకీయాలు అర్థమయ్యేసరికి బుద్ధిగా సినిమాల్లో నటిస్తున్నాడు. రాజకీయాల్లో పైకి రావాలంటే నాలాగ నటించాలి. మహానటుడు ఎన్టీఆరే నా ముందు నిలవలేకపోయాడు. ఇక వీళ్లంతా ఎంత?
ఇంతకూ మంత్రిగా నేనేం చేయాలి?
మన ప్రభుత్వ పాలసీ అంతా అమ్మడం, కొనడం. ప్రభుత్వాన్ని అమ్మాలి. అవసరమైతే అవతలి పార్టీ వాళ్లని కొనాలి. మంత్రి పదవంటే అర్థం మన శాఖని ఎంత కొల్లగొట్టామని
ఇప్పటికే చాలా తినేసాం కదా!
మనది కుంభకర్ణుడి ఆకలి.ఎంత తిన్నా తగ్గదు. నేనొక్కడు చాలననే కదా నిన్ను తీసుకున్నది.
మంత్రిగా ఇంకేం చేయాలి?
ఏం చేయొద్దు. ఏదో చేస్తున్నట్టు హడావిడి చెయ్యి. ఆకస్మిక తనిఖీలు అధికారులకి మందలింపులు, ఇష్టమొచ్చిన వాగ్ధానాలు చెయ్యి.మిగిలింది
మన మీడియా చూసుకుంటుంది. రేపటి నుంచి తండ్రికి మించిన తనయుడు, శాఖలపై పట్టు సాధిస్తున్న లోకేష్ అనే హెడ్డింగ్ లతో మన మీడియా హెడ్ లైన్స్ అదరగొడుతుంది చూడు అన్నాడు బాబు
అన్ని ఏర్పాట్లు చేసేసారన్నమాట సంతోషించాడు లోకేష్
నువ్వేం కంగారుపడకు, నీలో తాత ఎన్టీఆర్ ని చూస్తుంది మన మీడియా. పార్టీలో నువ్వు పెనుమార్పులు చేస్తున్నట్టు, పారదర్శక పాలన చేస్తున్నట్టు కూడా రాస్తారు.
నిజమా?
మన మీడియా ఎప్పుడైనా నిజాలు రాసిందా? అన్నాడు బాబు
Back to Top