ఎదుటి వారికి చెప్పేందుకే బాబు నీతులు



ఆద‌ర్శ రాష్ట్రం, ఆద‌ర్శ ముఖ్య‌మంత్రి, ఆద‌ర్శ పుత్ర ర‌త్నం, ఆద‌ర్శ తండ్రి, ఆద‌ర్శ విద్యార్థి, ఆద‌ర్శ అల్లుడు అయిన నారా ఆద‌ర్శ నాయుడు ఆకాశ వాణి విని చాలా రోజులు అయ్యింద‌ని కారులో ఎఫ్ ఎమ్ రేడియో ఆన్ చేయించారు. "ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోన్ట్ కేర్‌... నేను పుట్టాను, లోకం న‌వ్వింది" అంటూ ఘంట‌సాల గానం కంచులా మోగింది. ఆ పాట కాగానే గంట గంట‌కు వ‌చ్చే రేడియో వార్త‌లు మొద‌ల‌య్యాయి. 

"తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి టీ ఆర్ ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల‌పై మూడు నెల‌ల లోగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా స్పీక‌ర్ ను కోరిన న్యాయ‌స్థానం. ఇది త‌మ నైతిక విజ‌యం అన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కోర్టు ఆదేశాల‌ను స్వాగ‌తించిన టీడీపీ" ఇదీ ఆ వార్త‌ల సారాంశం. ఆద‌ర్శ బాబు వెంట‌నే కారు ఆపించారు. పక్క‌నే స్వీటు షాపులోకి త‌నే స్వ‌యంగా వెళ్లి , స్వీట్లు కొని క‌నిపించిన వారంద‌రికీ రేవంత్ రెడ్డి, కోర్టు ఆదేశాల క‌థ‌ను అడ‌గ‌ని వారికి కూడా చెప్పి వ‌చ్చి మ‌ళ్లీ కూర్చొన్నారు. ఎయిర్ పోర్టు వ‌చ్చింది. విమానంలో ఊర్లు తిర‌గ‌టానికి బాబు బ‌య‌లుదేరారు. విమానం ఎక్కేవ‌ర‌కు కుడి ఎడ‌మ‌ల రెండు ఫోన్ లో రేవంత్ బ్రీఫ్ డ్ మీ అంటూ వాట్ అయామ్ సేయింగ్ అని ముసి ముసి న‌వ్వులు న‌వ్వుతూనే ఉన్నాయి.

న్యాయం ధ‌ర్మం నైతిక‌త‌కు తాను విగ్ర‌హ రూపమ‌ని, త‌ను నిలువెల్లా నిప్ప‌ని బాబు ప‌దే ప‌దే చెప్పుకొంటుంటారు. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను అధికార పార్టీలోకి చేర్చుకోవ‌టం త‌ప్ప‌యితే, మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆద‌ర్శ‌బాబు చేస్తున్న‌ది ఏమిటి..? ఏ రేవంత్ రెడ్డి అడ‌గాలి ఆద‌ర్శ‌బాబుని,.? కోర్టు తీర్పు స్ఫూర్తి ఏపీకీ వ‌ర్తించ‌దా..?  తాను చేస్తే సంసారం, ఎదుటి వారుచేస్తే..?
ఇదే రేవంత్ రెడ్డి మా ఆద‌ర్శ బాబు బ్రీఫ్‌డ్ మీ, యూ ట్ర‌స్ట్ మీ, కౌంట్ దిస్ కరెన్సీ నోట్స్ అంటూ తిరుగు లేని వీడియో సాక్ష్యాల‌తో సహా ప్ర‌జా ప్ర‌తినిధిని కొన‌బోతూ దొర‌క‌లేదా.. దెయ్యాలు వేదాలు వ‌ల్లిస్తాయి.. మోసం ముసుగువేసుకొని ఆద‌ర్శాల‌ను తూర్పార‌ప‌డుతుంది. పులి ఆవు చ‌ర్మం క‌ప్పుకొని షికారుకి వెళుతుంది. ఈత చెట్టు ఎక్కి ఆవు పాలు పిండుతున్నామంటారు. ఆద‌ర్శ బాబు నందంట నందే, ప్ర‌శ్న‌ల‌డిగితే "ఉన్మాదం" ఉప్పొంగి ఉర‌క‌లు వేస్తుంది.
Back to Top