ఎత్తిపోత‌లా? ఉత్తికోత‌లా?

ఎక్క‌డ కాలువ క‌న‌బ‌డినా వెంట‌నే ప్యాంటు పైకి మ‌డిచి నీళ్ల‌లోకి దిగి పూలు, ప‌సుపు, హార‌తి అయ్యాక అక్క‌డే ఉన్న మీడియా గొట్టాల
ముందు  నాజ‌న్మ‌ధ‌న్యం, గోదావ‌రి జ‌న్మ నా వ‌ల్ల ధ‌న్యం, కృష్ణ‌మ్మ జ‌న్మ నావ‌ల్ల ప‌ర‌వ‌శం అంటూ వంశ‌వృక్షం
జ‌న్మ‌వృత్తాంతం చెప్ప‌డం బాబుకు అలవాటు అయిపోయింది. ఒక అనుసంధానం ప్ర‌చారం అనేక
కాలువ‌ల్లో ప్ర‌వ‌హిస్తూనే ఉంది. ఆ ప్ర‌చార ప్ర‌వాహం వేగం తగ్గిన ప్ర‌తిసారీ బాబు
ప్యాంటు పైకి మ‌డుస్తూనే ఉంటారు. అయితే మీడియా గొట్టాల ముందు ఆవు వ్యాసం క‌థ‌లోలా
బాబు మ‌ర‌చిపోకుండా చెప్పే అంశం - ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించ‌డం లేద‌ని. 

రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ వ‌ల్ల బాబు హైద‌రాబాద్ నుంచి త‌ప్ప‌నిస‌రిగా బిచాణా
ఎత్తేయాల్సి వ‌చ్చింది. అలాగ‌ని అమ‌రావ‌తిలో కూర్చుందామా అంటే కూర్చీ లేదు. కూర్చీ
కింద ఫ్లోరింగ్ లేదు. ఫోర్లింగ్ పైన పైక‌ప్పు లేదు. దాంతో విమానం రెక్క‌లు
తొడుక్కుని సింగ‌పూర్‌,
జ‌పాన్‌, చైనా, ర‌ష్యా, దావోస్ దేశాల‌కు డైలీ అప్ అండ్ డౌన్
చేస్తున్నారు. వెళ్లిన ప్ర‌తిదేశం, ప్ర‌తి న‌గ‌రం మీద బాబు ఎంత‌గా మ‌న‌సు
పారేసుకున్నా సింగ‌పూర్‌కు ఎప్పుడో తాళి క‌ట్టేశారు. కుంగిపోతున్న పునాదులు, క‌ల్ల‌ల‌వుతున్న రైతుల ఆశ‌లు, హైద‌రాబాద్ వ‌దిలి త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగుల
నిట్టార్పులు ఏవీ క‌న‌ప‌డ‌కుండా, వాటి మీద చ‌ర్చ‌కు ఆస్కారం లేకుండా గోదావ‌రి కృష్ణ‌:  కృష్ణ - పెన్న:
 పెన్న - కావేరి:  కావేరి - గంగ‌: గ‌ంగ - మంగ అంటూ స్వ‌దేశంలో ఉన్న‌ప్పుడు
కాలువ‌గ‌ట్ల వెంట బాబు తిరుగుతున్నారు. 

రైతుల‌కు నీళ్లివ్వ‌ద్ద‌ని, క‌రువు నేల‌కు మంచి నీళ్లివ్వ‌ద్ద‌ని ప్ర‌తిప‌క్షం అడ్డుకుంటోంద‌ని బాబు విష
ప్ర‌చారం మొద‌లుపెట్టారు. మోట‌ర్ల‌తో, బిందెల‌తో, చివ‌ర‌కు చెంబుల‌తో తోడి పోసినా సాంకేతికంగా
అనుసంధాన‌మే. అయితే ఒక్క సంవ‌త్స‌రంలో ఎన్నిసార్లు అవే న‌దుల‌ను అనుసంధానిస్తారు?  కాలువ మ‌లుపు మ‌లుపులో పసుపుజ‌ల్లి
ఎన్నిసార్లు ప్యాంట్లు పైకి మ‌డుస్తారు? ఉన్న‌వి ఎన్ని జ‌న్మ‌లు? ధ‌న్య‌మ‌య్యేవి న‌దులా? జ‌న్మ‌లా? క‌లిసేవి కాలువ‌లా? జ‌రుగుతున్న‌ది ఎత్తిపోత‌లా? ఉత్తికోత‌లా?

 

Back to Top