బాబు ఉలికిపాటు


గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది చంద్రబాబు వాటం చూస్తే. అక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దద్దరిల్లిపోతుంటే ఇక్కడ చంద్రబాబు ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ మేనేజ్ చేసే అవకాశం ఉందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని కంగారు పడుతున్నాడు. ప్రజా సంకల్పంలో ప్రజానేతకు హారతులు పడుతున్న జన శ్రేణిని చూసాక బాబుకు ఓటమి భయం మొదలైనట్టుంది. అభివృద్ధి మాటలు, అబద్ధపు హామీలు ఎన్ని చెప్పినా ఇక ప్రజలు నమ్మరని క్లియర్ గా అర్థం అయిపోతూనే ఉంది. ప్రతిపక్ష నేతకు అనూహ్యంగా పెరుగుతున్న ఆదరణే అందుకు సాక్ష్యం. 
ప్రజా సంకల్ప యాత్ర వల్ల భవిష్యత్ శాశసన సభ ఎన్నికల ఫలితాలను ముందే చవిచూస్తున్నంట్టుంది చంద్రబాబుకు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, లంచగొండితనం, అక్రమార్జన, నిర్లక్ష్యం, హోదాపై యూటర్నులు, అభివృద్ధిలో అధః పాతాళం వంటి నిర్వాకాలు చూసాకే ప్రజలు తనను ఓడించారని ఎలాగూ చెప్పుకోలేడు కనుక, ఓటమి వివిధ కారణలాను ముందు నుంచీ తయారుగా పెట్టుకుంటున్నాడు చంద్రబాబు. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల్లో మతలబుల వల్లే మేం ఓడిపోయామని చెప్పుకోవాలన్నిది చంద్రబాబు ముందుచూపు కావచ్చు. అందుకే కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజేపీతో పొత్తు పెట్టుకుందంటూ అసత్య ప్రచారాలకు తెరతీసాయి టీడీపీ శ్రేణులు. ఈ విషయాన్ని ఎలాగైనా ప్రజలను నమ్మించాలని స్వయంగా చంద్రబాబే పూనుకుని ప్రతి సభలోనూ బీజేపీ వైఎస్ జగన్ కలిసి పనిచేస్తున్నారని అదే పనిగా గోల చేస్తున్నాడు. 
ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి మద్దతు ఇవ్వడమే తప్ప, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని, ఒంటిరిగానే వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని వైఎస్ జగన్ ఎన్నో సార్లు చాలా స్పష్టంగా తమ విధానాన్ని ప్రకటించారు. చంద్రబాబులా పైకి తెగతెంపుల డ్రామా ఆడుతూ, ఆ పార్టీ నేతలను రహస్యంగా కలవడం, బిజేపీ నేతల బంధువులకు పదవులివ్వడం  వంటి నీచమైన రాజకీయాలు వైఎస్సార్ కుటుంబం ఎప్పుడూ చేసింది లేదు. రాబోయే ఎన్నికలను ప్రభావితం చేసే ఉభయగోదావరిజిల్లా వాసుల మనోగతం తెలిసినప్పటి నుంచే చంద్రబాబుకు ఈ ఉలికిపాటు మొదలైంది. ఎన్నికల కోసం సిద్ధం కమ్మని శ్రేణులకు పిలుపు ఇవ్వాల్సిన తొందరపాటు ఆవశ్యకం అయ్యింది. 

 
Back to Top