వ‌రానికి శాపం చంద్రబాబు..!


త‌ల‌పాగా లేక‌బ‌ట్టి స‌రిపోయింది... లేక‌పోతేనా, త‌స్సాదియ్యా నా ప‌నోడిత‌నం ఏపాటిదో చూపిద్దును... అన్నాడ‌ట వెన‌క‌టికొక‌డు. అట్టావుంది.. స్వ‌యం ప్రక‌టిత  సీనియ‌ర్ మోస్ట్  రాజ‌కీయ నాయ‌కుడు చంద్రబాబు వాల‌కం చూస్తే. ఎలా ఎక్కామ‌న్న‌ది కాదు... సిఎం కుర్చీ ఎక్కామా లేదా అన్న‌ది ముఖ్యం అన్న‌ట్లు... ప్రజ‌ల‌కు చేతికొచ్చిన హామీలు ఆశ‌జూపి, సీనియారిటీ ర‌బ్బ‌రు స్టాంపు అడ్డుపెట్టుకుని నిలువునా ముంచేసిన నిప్పుగారు... ఇప్పుడు నాలుగేళ్ల అవినీతి కాల‌క్షేపం త‌ర్వాత ఆయ‌న త‌ప్పిదాల‌న్నీ ఎవ‌రో ఒక‌రిమీద నెట్టేయ‌డంలో బిజీ బిజీ అయిపోయారు. అందులో భాగంగానే పోల‌వ‌రం పాటెత్తుకున్నారు నిప్పునాయుడుగారు. 

అధికారంలోకి వ‌చ్చింది మొద‌లు.. ఇదిగో పోల‌వ‌రం అదిగో పోల‌వ‌రం అంటూ కాక‌మ్మ క‌బుర్లు చెప్పి కాలం గ‌డిపేశాడు. ఎవ‌రైనా అడిగితే చిటికెలో ప‌ట్టిసీమ క‌ట్టినోడిని.. నాకు పోల‌వ‌రం పెద్ద లెక్కా అని బుకాయించేవాడు. ఆయ‌న భ‌జ‌న బృంద‌మైతే నాలుగాకులు ఎక్కువ న‌మిలేసి నోటికొచ్చిన‌ట్టు వాగారు. పోల‌వరం ఎందుకు ఆల‌స్య‌మ‌వుతుంది అని ప్రతిప‌క్ష నాయ‌కుడు అడిగితే... 2018 క‌ల్లా పోల‌వ‌రం పూర్తి చేసి నీళ్లు అందిస్తాం... దీన్ని ఆ దేవుడు కూడా ఆప‌లేడు రాసిపెట్టుకో అంటూ అతి పేలాప‌న‌లు పేలారు. మొత్తానికి అంతా ఉత్త‌దే అని తేలిపోయాక ఇప్పుడేమో 2018కి పోల‌వ‌రం క‌ష్టం అంటూ సిగ్గులేకుండా చేతులెత్తేశారు. ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని కోట్ల అవినీతి చేశాక చేత‌గాదంటే బాగోద‌ని... మ‌రోసారి ఎలాగూ ప్రజ‌లు అవ‌కాశం ఇవ్వ‌ర‌ని తెలిసి, కేంద్రం నిధులిస్తే  2019 క‌ల్లా పోల‌వ‌రం పూర్తి చేస్తాం అంటూ చెత్త‌రాగం అందుకున్నారు. అది విన్నాక అంద‌రికీ అర్థ‌మైన విష‌యం ఏంటంటే... పోల‌వ‌రం ఇక వీళ్ల వ‌ల్ల‌కాదు. నిర్ల‌జ్జ‌గా కేంద్రం మీద నెపం మొత్తం నెట్టేసి త‌ప్పుకోడానికి సిద్ధ‌మైపోయార‌ని.

రాష్ట్ర ప్రజ‌ల దురదృష్టం కాక‌పోతే... విభ‌జ‌న త‌ర్వాత జాతీయ‌హోదా వ‌చ్చిన ప్రాజెక్టును నేనే క‌డ‌తా నేనే క‌డ‌తా అని ఈ నిప్పునాయుడు లాక్కోవ‌డం ఏంటి? ఆయ‌న అవినీతికి భ‌య‌ప‌డి కేంద్రం నిధులు ఇవ్వ‌డానికి కూడా వెన‌క‌డుగు వేయ‌డ‌మేంటి? అంతా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఖ‌ర్మ అనుకోవ‌డం త‌ప్ప మ‌రో దారిలేదు. ఎందుకంటే ఈయ‌న‌గారు ..... చీము...  నెత్తురు.... అన్నీ వ‌దిలేసి హాయిగా ఐదేళ్లూ గ‌డిపేశాడు. ఇప్పుడు ఏమ‌నుకున్నా పోయేదేమీ లేదు. టార్గెట్ అంతా ఇంకోసారి ప్రజ‌ల్ని మోసం చేయ‌డానికి ఎలాంటి హామీలు ఇవ్వాలా అనే ఆలోచ‌న ఒక్క‌టే. మొత్తానికి న‌మ్మి ఓటేసిన పాపానికి, రాష్ట్రానికి తిరుగులేని వ‌రం లాంటి ప్రాజెక్టుకి.. ఐదేళ్లుగా ఈ వెన్నుపోటు నాయ‌కుడే శాపంగా మారాడంటున్నారు ప్రజ‌లు. 
Back to Top