చంద్రబాబుకి అంత టెన్షన్ ఎందుకబ్బా

 అమెరికాకి సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే  అమెరికా మట్టికొట్టుకుపోతోందటండీ బాబూ.ఈ మాటలన్నది ఎవరో అయితే నమ్మక్కర్లేదు కానీ.. వమెరికా మాజీ పెసిడెంటు బిల్ క్లింటన్ లేడూ..ఆయనగారి క్లోజ్ ఫ్రెండ్ చెప్పారీ మాట.
క్లింటన్ గారి క్లోజ్ ఫ్రెండంటే అర్ధమైంది కదా..మన సెందరబాబుగోరే.
అప్పట్లో క్లింటన్ గారూ సెంద్రబాబుగోరూ ఓ  కంచంలో తిని ఓ మంచంమీద పడుక్కునే వారని అప్పట్లో ఎన్టీర్ ట్రస్ట్ లో అందరూ అనుకునేవారు కూడానూ.
వమెరికా ఈ రోజు  పెపంచకంలో  మంచి పొజిషన్ లో ఉందంటే దానిక్కారణం మన సెందరబాబుగోరే కదా.
సెందరబాబుగోరి ఐడియాలు వినే  కిలింటన్ బాబు వమెరికాని నెంబర్ వన్ చేశాడు.
ఇపుడు వమెరికా ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా.
మా సెందరబాబుగోరికి అదో పని. అక్కడ ఎవరో ఒకరిని గెలిపించేయాల.
ఆయన ఇప్పటికే ఒకరికి సపోర్ట్ చేసి..బోలెడు ఐడియాలూ గట్రా ఇచ్చారు కూడానూ. ఆయన ఐడియాలు ఎవరికి ఇచ్చారో..ఎవరికి మద్దతు ఇచ్చారో.. ఎలక్షన్ రిజల్స్ వచ్చిన తర్వాత చెప్తాం.

అన్నట్లు  డొనాల్డ్ ట్రంపేటండీ బాబూ.
ఇంకేమీ పని లేదన్నట్లు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాట్టండీ బాబూ.
నలుగురిని పెళ్లిచేసుకోవడం తప్పు కాదా అని సెందరబాబుగోరు నిన్ననే  బలే కోప్పడ్డారు.
నాలుగు పెళ్లిళ్లు ఎవరు చేసుకున్నా కూడా సెందరబాబుగోరికి ఒళ్లు మండిపోద్ది సుమండీ.
మన పవన్ కళ్యాణ్‌ బాబు  మూడే పెళ్లిళ్లు చేసుకున్నాడు కాబట్టి..
ఎలక్షన్లలో ఆయనతో కూసింత పని ఉంది కాబట్టి.. ఆయన్ను కలుపుని పోయారు కానీ..లేదంటే మా సెందరబాబుగోరు పవన్ బాబును కూడా  డొనాల్డ్ ట్రంప్ ని మాదిరిగా పక్కన పెట్టేద్దురు తెలుసా?
పవన్ బాబుకు కూడా సెందరబాబుగోరి గురించి తెలుసు కాబట్టే.. మూడు పెళ్లిళ్లతో ఆగిపోనాడు కానీ...లేదంటే  నాలుగో అమ్మాయికీ తాళి కట్టీసీవోడే.

ఓ పక్క అమరావతి పనులు సింగపూరోళ్లకి ఇయ్యాలని ఆ పనిలో బిజీ.
మరో పక్క  ఓట్లకు కోట్లు కేసులో మళ్లీ విచారణలు గట్రా జరక్కుండా లాబీల్లో బిజీ.
ఇంకో వైపు మా లోకేష్ బాబు  పార్టీకి వైట్ ఎలిఫెంట్ గా మారిపోనారని ఓ ఎమ్మెల్యే తెలిసో తెలీకో కరెక్ట్ గా చెప్పేసినాడు కదా..ఆ ఎమ్మెల్యేని ఏటి చేయాలో అర్ధం కాక ఆ ఆలోచనల్లో బిజీ.
ఇన్ని బిజీలు ఉన్నా పాపం మా సెందరబాబుగోరు వమెరికా కోసం ఆలోచించక తప్పడం లేదు.
రేపు నవంబరు 8న వమెరికా పెసిడెంటు ఎవరనేది తేలిపోద్ది.
హిల్లరమ్మ గెలిచిందే అనుకోండి..  ఆమెకే సెందర బాబు గోరు సపోర్ట్ ఇచ్చినట్లు.
కొంప తీసి ట్రంప్ బాబుగానీ నెగ్గాడనుకోండి... ఏమో... ఆయనకు మా సెందరబాబు ఏం అవిడియాలిచ్చారో ఏటో ఇప్పుడే ఎలా తెలుస్తుంది?
రిజల్స్ వచ్చాక మా పచ్చ పత్రికల్లో చూసి తెలుసుకోండి.
----------------------

-------------------------

Back to Top