బిల్ గేట్స్ తో బాబు ఏం మాట్లాడారంటే..!

 

కాళ్ల‌కు స్కేటింగ్ చ‌క్రాలు క‌ట్టుకుని చంద్ర‌బాబు రివ్వున వ‌చ్చాడు. పిఏ
కంగారుప‌డి ఏంటి సార్‌,
ఎప్పుడూ చ‌క్రం
తిప్పేవాళ్లు ఇప్పుడు చ‌క్రాల‌నే కాళ్ళ‌కు క‌ట్టుకున్నారు

"మ‌న ప్ర‌భుత్వం న‌డ‌వ‌డం లేదు. ప‌రిగెడుతోంది"
అంటూ చంద్ర‌బాబు బ్యాలెన్స్ త‌ప్పి కింద ప‌డ‌బోయాడు

"వాగ్దానాలు చేసినంత సులువుకాదు, స్కేటింగ్ చేయ‌డం" అని పిఏ ప‌ట్టుకున్నారు.

ఇంత‌లో ఫోన్ మోగింది. పిఏ ఎత్తాడు. అవ‌త‌ల బిల్‌గేట్స్ లైన్‌లో వున్నాడ‌ని ఆయ‌న
పిఏ చెప్పాడు

బాబు ఉత్సాహంగా ఫోన్ అందుకుని "మ‌న‌వాళ్లు బ్రిఫ్‌డ్ మీ" అన్నాడు.

"ఆయ‌న‌కి తెలుగురాదు,  మీకు ఇంగ్లీష్ రాదు. ఇటివ్వండి" అని పిఏ ఫోన్ అందుకున్నాడు

 

బిల్‌గేట్స్ గారు. మా సార్ ఎస్వీ యూనివ‌ర్సిటీలో కాపీలు కొట్టి పాస‌యిన బాప‌తు.
ఆయ‌న ఇంగ్లీష్ మాట్లాడితే అదేం భాషో తెలియ‌క మీరు తిక‌మ‌క‌ప‌డ‌తారు మ‌నీ లాంగ్వేజ్
త‌ప్ప ఇంకే భాష స‌రిగా తెలియ‌దు ఆయ‌న‌కి" అని పిఏ ఇంగ్లీష్‌లో చెప్పాడు.

"ఇంగ్లీష్ రాకుంటే  ఆయ‌న సీఎం ఎలా అయ్య‌రు?" అని బిల్‌గేట్స్ ఆశ్చ‌ర్య‌పోయాడు. ఈ విష‌యాన్ని
పిఏ బాబుకి చెప్పాడు.

మా దేశంలో సిఎం కావ‌డానికి లాంగ్వేజి అక్క‌ర్లేదు. సూట్‌కేస్ ల‌గేజీ ఉంటే
చాలు. మా మామ ఎన్టీఆర్‌ని ప‌డ‌గొట్ట‌డానికి ఎమ్మెల్యేల‌ను సూట్‌కేస్‌తో కొన్నాను.
ఆయ‌న మైక్రోసాప్ట్ అయితే నేను మైక్రోహార్డ్" అన్నాడు బాబు.

పిఏ అనువాదం ప్రారంభించాడు.

 

"టిఫిన్ తిన్నారా?" అడిగాడు గేట్స్‌

"మాకు డ‌బ్బులు తిన‌డానికే టైం లేదు. ఇక
టిఫినేం తింటాం" అన్నాడు బాబు

"నాకు ఎందుకు ఫోన్ చేసారు"

"పెద్ద‌పెద్ద వాళ్ల‌తో మాట్లాడిన‌ట్టు పేప‌ర్‌లో
రాయించుకోడానికి"

"తొంద‌ర‌గా చెప్పండి. అవ‌త‌ల నేను బిజీ"

"అమ‌రావ‌తికి మీరేమైనా చేయాలి"

"అమ‌రావ‌తి అంటే?"

"మీకు ప‌ని లేదు కాబ‌ట్టి పొద్ద‌స్త‌మానం అమ‌రావ‌తి
అంటూవుంటారు. అందువ‌ల్ల ఆ పేరు అంద‌రికీ తెలుసు బిల్‌ గేట్స్ కి ఎలా
తెలుస్తుంది" అని అనువాద‌కుడు పిఏ క‌ల‌గ‌చేసుకున్నాడు

 

చంద్ర‌బాబు అదేం ప‌ట్టించుకోకుండా "అమ‌రావ‌తిలో అనేక కంపెనీలు పెడ‌తామ‌న్నందుకు
బిల్‌గేట్స్ గారికి కృత‌జ్ఞ‌త‌లు" అన్నాడు.

"లేనిది వున్న‌ట్టు, వున్న‌ది లేన‌ట్టు చెప్ప‌డ‌మే క‌దా మ‌న రాజ‌కీయం"
అన్నాడు బాబు

"కంప్యూట‌ర్ ఎలా ఆన్ చేయాలో అడ‌గ‌మ‌న్నారండి
బాబుగారు" అని బిల్‌గేట్స్‌ని అడిగారు పిఏ

"అది న‌న్న‌డ‌గలా?  నేనెవ‌రో తెలుసా" కోప‌గించుకున్నాడు
బిల్‌గేట్స్‌

"ఆయ‌న‌కి బిల్ క‌లెక్ట‌ర్‌కి, బిల్‌గేట్స్‌కి పెద్ద తేడా తెలియ‌దండి"

 

"ఏమ‌న్నారు?" అడిగాడు బాబు

"అమ‌రావ‌తిని ఎప్ప‌టికైనా క‌డితే 600 సాఫ్ట్ వేర్ కంపెనీలు పెడ‌తామ‌ని
చెప్పాడండి" అన్నాడు పిఏ

"అది నీ వాయిసా? ఆయ‌న వాయిసా?"

"మీ మైండ్ వాయిస్‌"

బాబు వెంట‌నే విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి రెండు రౌండ్లు స్కేటింగ్ చేసాడు

"వాకింగ్ చేస్తే టైం వేస్ట‌వుతుంద‌ని
స్కేటింగ్ చేస్తున్నా టైం వేస్ట్ చేయ‌డం న‌చ్చ‌దునాకు" అన్నాడు బాబు

"ఇంత‌కూ బిల్‌గేట్స్ ఏమ‌న్నాడు?" అడిగారు విలేక‌రులు

"పెట్టుబ‌డుల ప్ర‌వాహానికి గేట్లు ఎత్తేస్తాన‌న్నాడు"

"దానికి  మీరేమ‌న్నారు?"

"మ‌న‌వాళ్లు బ్రీఫ్‌డ్ మీ. థ్యాంక్స్"
అన్నాను

 

Back to Top