న‌గ‌రం క‌డ‌తావా నాయ‌నా....?

దేశ, కాల ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అభిరుచులు మారుతుంటాయి. చ‌లిదేశంలో వేడిగా స్వాగ‌తం అవ‌స‌రం, మ‌ర్యాద మండే ఎండ‌ల్లో చ‌ల్ల‌ని మ‌జ్జిగ అవ‌స‌రం, మ‌ర్యాద వేష‌భాష‌లు కూడా అంతే. భౌగోళిక ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌ను బ‌ట్టే అల‌వాట్లు, అచారాలు, సంప్ర‌దాయాలు పుడ‌తాయి - స్థిర ప‌డ‌తాయి.

   తెలుగువారికి కూడా ప్ర‌త్యేక‌మైన భాష‌, అంతులేని సాహిత్యం, గొప్ప చ‌రిత్ర, వార‌స‌త్వం ఉన్నాయి. తెలుగువారి గుండె చ‌ప్పుడుగా ఉండాల‌నే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు.తిన్న ఇంటి వాసాల‌న్నీ లెక్క‌క‌ట్టాక ఒక దుర్ముహుర్తాన చంద్ర‌బాబు ఆ తెలుగు దేశాన్ని ఎన్టీఆర్ నుండీ లాక్కుని చారిత్ర‌క అవ‌స‌రం కొద్దీ ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌న్నారు. వెస్రాయ్ విడిది ముందు సాక్షాత్తు ఎన్టీఆర్ మీదే చెప్పులు వేయించిన వారు త‌రువాత ఆయ‌న విగ్ర‌హానికి రోజూ పూల‌మాల‌వేసి న‌మ‌స్కారం పెడుతున్నారు. అదో క్రూర ప‌రిహాస క‌వితా న్యాయం. పాపం ! ఎన్టీఆర్ చ‌నిపోయి బ‌తికి పోయాడు.

విభ‌జ‌న త‌రువాత అవ‌శేష ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు రాజ‌దాని ఎక్క‌డ అన్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు ల‌క్ష‌ణంగా ఏటా వీలైతే మూడు పంట‌లు పండే భూములే కావాల్సివ‌చ్చింది ఢిల్లీలో బీద అరుపులు అరిచే చంద్ర‌బాబుకు. భూసేక‌ర‌ణ‌, స‌మీక‌ర‌ణ‌, పూలింగ్‌, చ‌ట్టం, చుట్టం అంటూ మొత్తం మీద సింగ‌పూర్‌కు భ‌విష్య‌త్త్ వ్య‌క్తి గ‌త అవ‌స‌రాల‌కు స‌రిపోయేలా స‌స్య‌శ్యామల సీమ‌ల‌ను చెర‌ప‌ట్టారు.

 అయితే కొత్త రాజ‌దాని ప్ర‌తివాద‌న స్థాయి నుండీ చంద్ర‌బాబుకు ఒక భ‌యం ప‌ట్టుకుంది. అమ‌రావ‌తి పేరిట ఏర్ప‌డ‌బోయే రాజ‌ధాని ఎక్క‌డ తెలుగుదనాన్ని ప్ర‌తిబింబిస్తుందోన‌న్న‌దే  ఆయ‌న భ‌యం. వెయ్యేళ్ళు నిల‌బ‌డి, యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌త్యేకించి  ఇట‌లీ అసూయ ప‌డేలా కొత్త  రాజ‌ధానిని  నిర్మిద్దాం అని ప‌దేప‌దే ప్ర‌జ‌ల‌కు చెప్పే నారా పుత్ర చంద్ర‌క‌ర్ణి అమ‌రావ‌తిని ఏ న‌గ‌రంలా క‌ట్టాలో తేల్చుకోవ‌డానికి ప్ర‌పంచ‌యాత్ర‌లు చేస్తున్నారు.

 సింగ‌పూర్‌తో బాబుది విడ‌దీయ‌రాని బంధం కాబ‌ట్టి వారికి కొంత భూమి ఇవ్వ‌డం అర్థం చేసుకోద‌గ్గ‌దే. జ‌పాన్ వెళ్లాక వారిని కూడా పిల‌వాల్సివ‌చ్చింది. జ‌పాన్ డెస్క్‌, టేబుల్‌, కౌంట‌ర్ లాంటివి అమ‌రావ‌తి, ఢిల్లీలో కార్పెంట‌ర్లు త‌యారుచేస్తున్నారు. చైనా వెళ్ల‌గానే చైనా వ‌స్తువులు, భ‌వ‌నాలు వారంలో అర‌వై అంత‌స్థులు క‌ట్టే వారి వేగం బాబుకు తెగ‌న‌చ్చాయి. వారు కూడా హొంకాంగ్ తీరం నుండీ అమ‌రావ‌తికి ఓడ‌ల్లో బ‌య‌లుదేరారు. తాజాగా ర‌ష్యాలో శ్రీ‌వారు తిరుగుతున్నారు. అమెరికాలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార ప్ర‌తినిధులు కో అంటే కోటి మంది ఉండ‌నే ఉన్నారు. కొరియా, జ‌ర్మ‌నీ, ట‌ర్కీల‌ను కూడా తీసి పారేయ‌డానికి వీలులేదు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీ‌లంక పొరుగునే ఉన్నా అక్క‌డి న‌గ‌రాల‌ను కూడా చూసి తీరాల్సిందే. ఏలిన‌వారి అబ్బాయి స్టాన్‌ఫ‌ర్డ్‌లో చ‌దివారు కాబ‌ట్టి ఈ ప్ర‌పంచ సంచార విఙ్ఞానానికి అది అద‌నం.

   అమ‌రావ‌తి గుడారాల్లో ముందుగా వ‌చ్చి స‌న్ రైజింగ్‌, గ్రాఫిక్స్, యానిమేష‌న్ ఇచ్చిన సింగ‌పూర్ వారు మిగ‌తా దేశాల‌తో క‌లిసి ప‌ని చేస్తారా లేక ఒక్కో ఎక‌రం ఒక్కో దేశానికి ఇచ్చి వారి శైలిలో విశ్వ‌న‌గ‌రం నిర్మిస్తారా అన్న‌ది సామాన్యుల సందేహం. కానీ, ఈ విష‌యంలో బాబుకు చాలా స్ప‌ష్ట‌త ఉంది. ఒక్క అంగుళం కూడా తెలుగుదేశం లేకుండా ఉంటే చాలు. ఇంకెలా ఉన్నా, ఎవ‌రు క‌ట్టినా, ఎవ‌రేమ‌న్నా బాబుకు ప‌ట్టింపు లేదు. మొహ‌మాటం లేకుండా ఆయ‌న పైకి చెప్పారు కూడా- ఎవ‌రున్నారు ఇండియాలో సిటీలు క‌ట్టిన‌వారు ? అని

   చ‌రిత్ర‌లో బాబు నిలిచిపోతారు. ఒక న‌గ‌రం క‌ట్ట‌డానికి ప్ర‌పంచంలో ఉన్న అన్ని న‌గ‌రాల వీధివీధి తిరిగిన వ్య‌క్తిగా ఆయ‌న నెల‌కొల్ప‌బోయే రికార్డును బ‌హుశా ఎవ‌రు చెరిపి వేయ‌లేరేమో....?

తాజా వీడియోలు

Back to Top