సాంకేతిక బాబెక్సా

గూగుల్ తరహాలో ప్రభుత్వ పాలన అన్నాడు బాబు. 
అంటే అడిగారు ప్రజలు.
మీరేదడిగినా రియల్ టైమ్ గవర్నెన్స్ లో అంతా తెలిసిపోతుంది. ఇంటి నుంచే మీ సమస్యలను అడగొచ్చు. ఈ సాంకేతికత దాన్ని అధికారులకు చెప్పి పరిష్కరిస్తుంది. అదే అలెక్సా...
అంటే జన్మభూమి కమిటీలను పీకేస్తున్నారా?
లేదు లేదు అవి కంటిన్యూ అవుతాయి?
సరే అలెక్సాను ఏమేం అడగొచ్చు...ప్రజల ప్రశ్న.
ఏదైనా అడగండి రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వ పథకాలు ఏదైనా సరే. మీరు అడిగిందే తడవుగా చెప్పేస్తుందీ టెక్నాలజీ...
రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ అయ్యిందా...అడిగారు ఒకరు...
అలెక్సా కాసేపు మౌనంగా ఉంది...మీరన్నది అర్థం కాలేదు అని సమాధానం వచ్చింది. 
రైతులు రుణమాఫీ మళ్లీ అడిగారు...
రికార్డుల్లో ఉన్నది చెప్పాలా రైతులకు జరిగింది చెప్పాలా? క్లారిటీ కావాలని అడిగింది అలెక్సా. 
అర్థమైంది అన్నారు ప్రజలు.
రాజధాని అమరావతి ఎప్పుడు మొదలౌతుంది అడిగారు మరొకళ్లు.
మళ్ళీ ఆలోచన్లో పడింది ఆధునిక సాంకేతిక వ్యవస్థ. కాసేపటి తర్వాత బదులిచ్చింది  మీరు అడిగినదానికి అలెక్సా నే కాదు ఆ దేవుడు కూడా ఆన్సర్ చెప్పలేడు.
తెలిసింది అన్నారు ప్రజలు.
ప్రత్యేక హోదా వస్తుందా ఇంకొకరి ప్రశ్న.
వస్తుంది, వచ్చినా ఉపయోగం లేదు, హోదా అంటే జైలే, హోదా ఎందుకు దండగా ప్యాకేజీ ఉండగా, ప్యాకేజీ హోదా సమానం, హోదా కావాలి, హోదా రాబోతోంది...
ప్రజలు అలెక్సాను పూర్తిగా అవగతం చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే లెక్కలు, చిలకలా అప్పచెప్పే టెక్నాలజీ పేరే అలెక్సా అని నిర్థారించారు. 
చివరగా ఒక ప్రశ్న సంధించారు..
ఎపికి ఈ పాలన నుంచి విముక్తి ఎప్పుడు?
Back to Top