లీకుల్లోనే కోపం

అమ‌రావ‌తి)) ముఖ్య‌మంత్రి తాపీగా టీ తాగుతూ 4కె రెసొల్యూష‌న్ అతిపెద్ద టీవీ ఆన్ చేశారు.
అప్ప‌టికే ఆయ‌న పౌర సంబంధాల అధికారులు పోటీలు ప‌డి ఇచ్చి లీకులు ఎలా వ‌స్తున్నాయో
ముందు చూసుకున్నారు. విజ‌య‌వాడ కేబుల్ నెట్ వ‌ర్క్ లో త‌న స్ర్కోల్ గంట‌కు
ఆరుసార్లే రావ‌డంపై ఇంట‌ర్‌క‌మ్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి, పెద్ద ఛాన‌ళ్లలో వ‌చ్చిన‌ట్లు అందులో కూడా
గంట‌కు అర‌వైసార్లు రావాల‌ని ఆదేశించారు. అలా కాకుంటే పోలీసుల‌కు చెప్పి కేబుల్
వైర్లు పీకి పారేయండ‌ని హుంక‌రించాడు. ఈ లోపు టీవీల్లో పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను
చూస్తు టీడీపీ ఎంపీల‌కు ఆదేశాలిస్తున్న చంద్ర‌బాబు అని బ్రేకింగులు వచ్చేశాయి.  నిజంగానే టీవీల్లో లైవ్ చూస్తూ చంద్ర‌బాబు దేశం
త‌మ్ముళ్ల‌కు స‌ల‌హాలిస్తున్నారు.

గ‌ల్లా జ‌య‌దేవ్ ఎనిమిది అంగుళాలు ఎడ‌మ ప‌క్క‌కు జ‌ర‌గాలి. ఆయ‌న బ్యాన‌ర్‌కు
అడ్డుగా ఉన్నాడు. నిమ్మల కిష్ట‌ప్ప ష‌ర్టు మ‌రీ తాజాగా ఉంది. కొంచెం టైట్ చేయించుకోవాలి.
సుజనా చౌద‌రి ఈసారి కెమెరా ముందు న‌ల్ల‌క‌ళ్ల జోడు పెట్టుకోకూడ‌దు. అవంతి శ్రీ‌నివాస్
మ‌రీ వంగిపోయి న‌డుస్తున్నాడు. నిటారుగా గ‌డ‌వాలి. మ‌న మ‌హిళా ప్ర‌తినిధి చీర
కాషాయం రంగుకు ద‌గ్గ‌ర‌గా ఉంది. పసుపు రంగే ఉండాలి. మైకుల‌కు ద‌గ్గ‌ర‌గా జేసీ
దివాక‌ర్ రెడ్డి ఉండ‌కూడ‌దు. ఇలా ఒక్కో ఎంపీ వీడియోను చూస్తు చాలా సునిశిత‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్నారు చంద్ర‌బాబు. 

అయితే మీడియాలో లీకులు ఇలా ఉన్నాయి. 

ప్రాణం పోయినా గాంధీ విగ్ర‌హాన్ని వ‌ద‌ల‌ద్ద‌ని ఎంపీల‌ను ఆదేశించిన చంద్ర‌బాబు,
స్తంబాలమ‌య‌మైన పార్ల‌మెంటును పూర్తిగా స్తంబించాల‌న్న బాబు. మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కొస్తామ‌న్న
ఎంపీలు, రాష్ట్ర భ‌విష్య‌త్తు దృష్ట్యా కొంత కాలం వేచి చూడ‌ల‌న్న చంద్రబాబు. అరుణ్‌జైట్లీ
ఉప‌న్యాసం త‌రువాత ఎర్ర‌బ‌డ్డ బాబు రెండుక‌ళ్లు, కోపంతో మ‌రిగిన బాబు ర‌క్తం, పెరిగిన బీపీ, త‌గ్గిన షుగ‌ర్ లెవ‌ల్‌, ఎయిమ్స్ నుంచి వైద్యుల రాక‌... ఈస్ర్కోలింగ్‌లు
ఆగ‌డం లేదు

ఇదండీ లీకు వీరుల వారి లీకుల గాథ. మ్యాటర్ అర్థమైంది కదా స్క్రోలింగ్ లీకుల
స్టోరీ. 

Back to Top