సింగపూర్ లో అమరావతి సినిమా

కొద్ది
రోజుల గ్యాప్ తర్వాత చంద్రబాబు మళ్లీ సింగపూరు ఫ్లైట్ ఎక్కారు. రెండేళ్లకోసారి
జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు వెళ్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు
సింగపూర్ ప్రేమ ఎలాంటిదంటే ఆరునెల్లకోసారి ఆ దేశాన్ని తలుచుకోనిదే బాబుకు నిద్రపట్టదు. ఇంతకీ
విశ్వ నగరాల సదస్సులో బాబుగారు ఏం చేయబోతున్నారో ఆస్థాన మీడియా ఆకర్షణీయంగా వివరిస్తోంది. ముఖ్యమైన
సమావేశాలు, బృంద చర్చలు, పట్టణీకరణపై కీలక ప్రసంగాలు, వివిధ
దేశాల వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులతో ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ
ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ అబ్బో మూడు రోజుల కాలంలో బాబుగారికి
బోలెడంత షెడ్యూల్.

ఇదంతా
రాజధాని అమరావతికోసమేనట. అమరావతిని ఎంత వేగంగా, ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా
నిర్మించాలనే తపనతో ఈ ప్రపంచ నగరాల సదస్సును అవకాశంగా ఉపయోగించుకుంటా అని చెబుతున్నారు
ముఖ్యమంత్రిగారు. రైతుల భూములు సింగపూరు కంపెనీలకు కట్టబెట్టేయడం అమరావతి అభివృద్ధిలో
తొలిఘటం అనుకుంటే, ఆ దేశంతో వైమానిక సంబంధాలకు తహతహ లాడటం రెండో ఘట్టం. ఇక మాస్టర్
ప్లాన్ అంటూ తయారు కాని నగరంలో అభివృద్ధి అవకాశాల గురించి గొప్ప ప్రెజెంటేషన్ కూడా
సిద్ధమైందట. జాయింట్ ఓపెనింగ్ ప్లీనరీలో అమరావతి పెవిలియన్ పేరుతో ప్రతినిధులకు
సినిమా చూపించబోతున్నారట కూడా. అంటే ఇక్కడ మనకు సింగపూరు కంపెనీలు
కట్టబోయే అమరావతిని గ్రాఫిక్కుల భ్రమరావతిగా ఎలా ప్రెజెంట్ చేసి చూపించారో అంతకు మించి
అమరావతి గురంచి వారికి బిల్డప్ ఇస్తున్నారన్నమాట. గొప్ప నదీ తీరం, వేలాది
ఎకరాల సారవంతమైన భూములు, బ్రహ్మాండమైన రోడ్లు, ఆకాశాన్ని
తాకే అద్భుత కట్టడాలు, అపురూపమైన నిర్మాణాలు, అబ్బురపరిచే
అర్కిటెక్ వండర్లు, ఫ్లైవోవర్లు, బుల్లెట్ ట్రైన్ ను తలదన్నేరవాణా
సౌకర్యాలు అబ్బో ఆ పెవిలియన్ లో అమరావతిని చూసిన తెలుగువాడెవడైనా అమరావతిలో ఇవన్నీ
ఎప్పుడు వచ్చాయి అని బిత్తరపోవడం ఖాయం. పెట్టుబడులు పెట్టుకోడానికి అమరావతిని
మించిన సిటీ లేదంటే నమ్మండి అని వారికి చూపడం చంద్రబాబు కోసం బాబు తయారు చేయించిన గ్రాఫికల్
సినిమాయే అమరావతి పెవిలియన్.

ఎక్కడి
పాట అక్కడ పాడినట్టు ఎక్కడి కథలు, చిత్రాలు అక్కడ చూపించడంలో బాబును
మించిన వాళ్లు లేరు కదా! వివిధ దేశాల ప్రతినిధులకు అమరావతి
అని నాలుగేళ్ల కింద పుట్టిన నగరం గురించి ఎంత వరకూ అవగాహన ఉంటుందన్నది పక్కన పెడితే
బాబు చూపించిన సినమా చూసి బాహుబలి చూసినంత ఎగ్జైట్ అవటం ఖాయం అంటున్నారు. గతంలో
కొరియా ప్రతినిధులు పిలిచారని వెళ్లి మూడురోజులు టూరేసి వచ్చాడు చంద్రబాబు. కొరియన్లు
అమరావతిని రెండో రాజధాని చేసుకోవాలని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. అనంతపురంలో
కొరియాకు చెందిన16 ఆటోమొబైల్
అనుబంధ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అని, ప్రాధమిక అవగాహనా ఒప్పందం కూడా
కుదిరిపోయిందని కథలు చెప్పారు. 24,600 కోట్లు పెట్టుబడులని ఊదరగొట్టారు. ఈ క్లస్టర్
కోసం అనంతపురం ఎర్రమంచి దగ్గర534 ఎకరాలు, గుడిపల్లిలో71 ఎకరాలు, అమ్మవారిపల్లి
దగ్గర131 ఎకరాలు కేటాయించేసినట్టు కూడా
చెప్పారు. ఎపికి బ్రాండ్ ఇమేజ్ రానుందని కోతలు కోసారు. నాలుగు నెలలు గడిచిపోయినా మళ్లీ ఉలుకు పలుకూ లేదు. ఒక్క
కొరియన్ కంపెనీ అని ఏముంది ఇంత వరకూ బాబు చెప్పిన లక్షల కోట్ల ఎమ్.ఓ.యులు, అవి చేసిన
కంపెనీలు ఏమయ్యాయో అజా పజా లేదు. ఇప్పుడు సింగపూర్ నించి ఎన్ని
వేల కోట్ల ఎమ్.ఓ.యులు ఎన్ని కంపెనీల పేర్లు వినబడతాయో
అని ఎపి ప్రజలు ఎదురు చూడాలి. 

Back to Top