ఆల్ ఫినిష్ 

నాతో పెట్టుకుంటే ఆల్ ఫినిష్ అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ విషయం ఆయన ప్రత్యేకంగా చెప్పాలా? ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది కదా! బాబు కాలుపెడితే అన్నీ ఫినిష్, బాబు మాట నమ్మితే ఎవ్వరైనా ఫినిష్, బాబు పాలనలో రాష్ట్రమంతా ఫినిష్. 
ప్రపంచ స్థాయి రాజధాని, ఐకానిక్ టవర్స్, ఆనంద నగరం, ఆయుష్షు పెంచే అమరావతి, బాహుబలిని తలదన్నే భవనాలు అంటూ గ్రాఫిక్స్ చూపించి చివరకు రాజధానిని ఫినిష్ చేసాడు.
ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలి అది బీజేపీ ఇస్తుంది అని చెప్పి చివరకు హోదా కంటే ప్యాకేజీ బెస్టు, హోదా ప్యాకేజీ సమానం, హోదా బీజేపీ ఇవ్వకుండా మోసం చేసింది అంటూ ప్రత్యేక హోదాను ఫినిష్ చేసేసాడు.
బీసీలను ఉద్ధరిస్తా అని చెప్పి, బీసీ హాస్టళ్లు మూయించి, బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసి వాళ్ల భవిష్యత్తును ఇస్త్రీ పెట్టెలకు పరిమితం చేసి వాళ్ల జీవితాలు ఫినిష్ చేసాడు.
ఫాతిమా విద్యార్థులను ఆదుకుంటానని, వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని చెప్పి, వాళ్లను తిప్పించుకుని చివరకు తిట్టి వారి చదువులు ఫినిష్ చేసాడు.
ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తా, పోలవరం నేనే కట్టేస్తా అంటూ వేల కోట్లు అంచనాలు పెంచి, కమీషన్లు వసూలు చేసుకుని అన్నిటినీ గాలికొదిలేసి సాగునీటి రంగాన్నే ఫినిష్ చేసేసాడు.
రుణమాఫీలని నమ్మించి రైతులను, డ్వాక్రా మహిళలను ఫినిష్ చేసేసాడు.
ఇంటికో ఉద్యోగం, రెండువేల నిరుద్యోగభృతి అని అబద్ధాలు చెప్పి నిరుద్యోగులను ఫినిష్ చేసాడు. 
సొంతపార్టీ మంత్రి ప్రైవేటు విద్యాసంస్థలు ఉద్ధరించడం కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని ఫినిష్ చేసాడు.
విజయాడైరీ, చక్కెర ఫ్యాక్టరీలు, సహకార సంఘాలను ఫినిష్ చేసాడు.
పింఛన్లు ఫినిష్ చేసాడు.
ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయంబర్స్ మెంట్ లనూ పూర్తిగా ఫినిష్ చేసాడు. 
ఓటర్ల లిస్టులో లక్షలాది ఓట్లు ఫినిష్ చేసాడు.
పక్క రాష్ట్రంలో ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయి రాష్ట్రం పరువును ఫినిష్ చేసాడు.
23 మంది ప్రతపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని ప్రజాస్వామ్యాన్ని ఫినిష్ చేసాడు. 
బాబు ఫినిష్ చేయనివి ఏమైనా ఉంటే అవి  అహంకారం, అధికార దాహం, అక్రమాస్తులు, అవినీతి పాలన...తప్ప మరేమీ కాదు. 

 

Back to Top