ఆట ఆగిందా సీటు గోవిందా

 

కుర్చీలాట జరుగుతోంది. మొత్తం 175 కుర్చీల చుట్టూ 176 మంది ఎల్లో టీషర్టులు
వేసుకుని తిరుగుతారన్నమాట. ఈ ఆటకు సంబంధించిన రూల్స్
ను ముందుగానే ప్రకటించారు ఆర్గనైజర్స్. మామూలుగా అయితే కుర్చీల చుట్టూ పాట ఆపేదాకా తిరిగి, పాట ఆగగానే ఎవరికి దొరకిన
సీట్లో వారు కూర్చోవాలి. కుర్చీ దొరకని వాళ్లు ఔట్ అవుతారు. కానీ ఇక్కడ రూల్ వేరు. పాట ఆగిన తర్వాత ఎవ్వరూ
సీట్లో కూర్చోకూడదు. మిస్టర్ పప్పేష్ తనకు నచ్చిన సీట్లో కూర్చున్న తర్వాతే మిగితా వాళ్లు సీట్లు
దొరకబుచ్చుకోవాలన్నమాట. ఈ విషయాన్ని ముందుగానే అభ్యర్థులకు, అదే పార్టిసిపెంట్లకు
చెప్పి ఉండటంతో వారంతా నిట్ట నిలువుగా తలలూపారు. పప్పేష్ ఎక్కడ కూర్చున్నా పర్లేదని, ఏ సీట్లో కూర్చుంటే
ఆ సీటు అదృష్టం చేసుకున్నదౌతుందని ప్రకటించారు. ఇంకొందరైతే పప్పేష్ అసలు పరిగెత్తాల్సిన పనేం ఉంది. నేను కూర్చున్న నాసీటు
ఇచ్చేస్తా కూర్చోమనండి అని చెప్పాడు అభిమానం పొంగుకు రాగా. దానికి పప్పేష్ కన్నీళ్లు
పెట్టుకున్నాడు. నా పై మీకున్న అభిమానానికి కుర్ర అత్త తన్నులు అన్నాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు. ఆర్గనైజర్లు దాన్ని
సరిదిద్ది చెప్పారు. పప్పేష్ తన కృతజ్ఞతలు చెప్పుకున్నారని. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కుర్చీలాట మొదలైంది. పాట ఆగిందా మీ సీటు
గోవిందా అంటూ పాట మొదలైంది. అందరూ కుర్చీల చుట్టూ పరుగుతీస్తున్నారు. పైకి సీటిచ్చేస్తానని
ప్రగల్బాలు పలికినాయన గుండె గుబగుబ లాడుతోంది. ఎక్కడ తన సీటు నచ్చేసి అందులో కూర్చుంటానంటాడో అని
అనుమానంగా పప్పేష్ వంకా, తన సీటు వంకా చూసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ల పరిస్థితీ
అలాగే ఉంది. అసలే కంటెస్టెంట్లు ఎక్కువున్నారు. వాళ్లు చాలక పక్క టీముల వాళ్లు కూడా వచ్చి చేరారు. సీట్లు తక్కువ, కాండెట్లు ఎక్కువగా
అయ్యింది పరిస్థితి. ఇప్పుడు పప్పేష్ ఎవరి సీటుకు ఎసరు పెడతాడో అని ఆదుర్దాగా చూస్తూ పరుగెత్తుతున్నారు
అందరూ. పాట ఆగింది. అందరూ ఆగారు. పప్పేష్ కూడా ఆగాడు. ముందు ఎదురుగా ఉన్న కుర్చీలో కుర్చున్నాడు. వెంటనే అది ఒక కాలు
విరిగి పక్కకు పడిపోయింది. దాంతో పప్పేష్ కుర్చీతో సహా కిందపడ్డాడు. లేచి దుమ్ము దులుపుకుంటూ
ఇది ప్రతిపక్షాల కుట్ర. నా కుర్చీ కాలు విరగ్గొట్టి నన్ను అప్పు దిష్ట చేయాలనుకున్నారు. నాకీసీటు వద్దు అంటూ  మరో సీటు దగ్గరకెళ్లాడు. దాంట్లో కూర్చున్నాడో
లేదో అది బాలెన్స్ లేక ఊగడం మొదలెట్టింది. ఇది నాకు లాభం లేదు మరో సీటు ట్రై చేస్తా అంటూ ఇంకో
కుర్చీ దగ్గరకెళ్లాడు. ఇలా ఉన్న అన్ని కుర్చీలనూ టెస్టు చేసినా పప్పేష్ ను
కూర్చొబెట్టుకునే కుర్చీ ఒక్కటీ కనిపించలేదు. ఆర్గనైజర్లకు ఏం చేయాలో తోచలేదు. చివరకు ఓ చాప తెచ్చి
కిందేశారు. పప్పేష్ గారూ ఇక్కడ కూర్చోండి ఈ సీటు పడదు, కదలదు, మీ సిట్టింగ్ కి ఢోకా ఉండదు అన్నారు. అలా సెటిల్ అయిన పప్పు
నేటికీ చాపనంటిపెట్టుకునే ఉన్నాడు. సీటు పేరు చెబితే భయపడుతున్నాడు. 

తాజా ఫోటోలు

Back to Top