కోటి సంతకాలతో కూటమి కుట్రలను తిప్పికొడదాం
అన్నమయ్య జిల్లా: కోటి సంతకాలతో కూటమి కుట్రలను తిప్పికొడదామని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాలివీడు మండలం పూలుకుంట, బోరెడ్డిగారిపల్లె గ్రామాల్లో శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, హిందూపురం పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ జగనన్న పాలనలో ప్రజల సంక్షేమం ప్రజల ముంగిటికి చేరిందన్నారు, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదల కలలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్య హక్కును ధనికుల ఆస్తిగా మార్చే కుట్ర జరుగుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పాలనను రివర్స్ గేర్ పాలనగా అభివర్ణిస్తూ, ఆయన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.వైద్యాన్ని పేదల దరిదాపుల నుంచి దూరం చేయాలనే ప్రయత్నానికి ప్రజలే అడ్డుగోడగా నిలవాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి సంకల్పించిన ప్రజావైద్య విధానాన్ని కాపాడడం ప్రతి కార్యకర్త బాధ్యత” అని పిలుపునిచ్చారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అవి పేదల ఆరోగ్య భద్రతకు ప్రతీకలుగా నిలుస్తాయని అన్నారు. ఆ నిర్మాణాలను అడ్డగించే ప్రయత్నం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో రచ్చబండలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణను బలోపేతం చేయాలని, ఆ తర్వాత గవర్నర్‌కు సంతకాల ప్రతులు అందజేసి ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలని సూచించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇది ప్రజా ఉద్యమం కావాలన్నారు. పౌరసమాజం, మేధావులు, ప్రజాసంఘాలు అందరూ కలిసిరావాలని పిలుపు నిచ్చారు.

కార్యకర్తలకు ఎల్లవేళలా తోడుగా ఉంటా...
జగన్ 2.0 లో కార్యకర్తల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని, కార్యకర్తల త్యాగం, కృషి పార్టీ బలానికి వెన్నెముకగా నిలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం, పార్టీ బలోపేతం కోసం ఎప్పటికీ కార్యకర్తలతోనే ఉంటానని భరోసానిచ్చారు.
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: హిందూపురం పరిశీలకులు రమేష్ రెడ్డి
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని హిందూపురం పరిశీలకులు రమేష్ రెడ్డి అన్నారు.రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు.
ఘన స్వాగతం
కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డిలకు స్థానిక ప్రజలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గజమాలలు వేసి ఆత్మీయంగా సత్కరించారు. నాయకులు ఒక్కొక్కరిని పేరుపేరునా పలకరించి, మమేకమయ్యారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గుమ్మా అమర్నాథ్ రెడ్డి ,నిజాముద్దీన్, సర్పంచులు కామసాని చెన్న కేశవరెడ్డి, నారాయణ, ఉమాపతి రెడ్డి, ఎంపిటిసి చంద్రప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు హరినాధ రెడ్డి,వెంకట నారాయణరెడ్డి,వైసీపీ నాయకులు మద్దిరాల భానుమూర్తి రెడ్డి, అరవ మహదేవ రెడ్డి, గంగిరెడ్డి, సుబ్బా రెడ్డి, అంజనేయ రెడ్డి, మైనారిటీ అధ్యక్షుడు మన్సూర్, ఆరవ జనార్దన్ రెడ్డి, ఖలందర్ బాష,మాజీ కో ఆప్షన్ మహబూబ్ బాష,నాగభూషన్ రెడ్డి,మాజీ డైరెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.