యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ తీరుపై ఉద్యమించాలి
తాడేపల్లి: నిరుద్యోగులను, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ తీరుపై ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి వారి పక్షాన నిలబడాలని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ యువజన విభాగం అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అన్నంరెడ్డి అదీప్ రాజ్, కారుమూరి సునీల్ కుమార్, పేర్ని కిట్టు, భూమన అభినయ్ రెడ్డి, బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి, యువజన విభాగం ఉపాధ్యక్షులు, పలువురు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మీడియాకు వివరించారు.
జక్కంపూడి రాజా ఏమన్నారంటే..
- వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ గారు చెప్పినట్లు యువజన విభాగం కమిటీలన్నీ త్వరగా పూర్తిచేయాలి
- ఈ నెల 25 లోగా మండల స్ధాయి యువజన విభాగం అధ్యక్షుల నియామకం పూర్తవ్వాలి
- నవంబర్ 15లోగా మండల కమిటీలు, గ్రామ యువజన విభాగం అధ్యక్షుల నియామకాలు పూర్తవ్వాలి
- నవంబర్ 30లోగా యువజన విభాగం గ్రామ కమిటీలు పూర్తవ్వాలి
- యువజన విభాగం నాయకులంతా తరచూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలి
- రాష్ట్రస్ధాయి నుంచి గ్రామస్ధాయి వరకూ అందరినీ భాగస్వామ్యం చేసి కార్యక్రమాలు నిర్వహించాలి
- ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్దితో పనిచేయాలి
- వైయస్ఆర్‌సీపీది ప్రజల పక్షమేనని అధినేత జగన్ గారు చెప్పినట్లు నిరుద్యోగులను, యువతను మోసగించిన కూటమి ప్రభుత్వ తీరుపై ఎప్పటికప్పుడు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి వారి పక్షాన నిలబడాలి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఫీజురీఇంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి ప్రధాన సమస్యలపై యువత గళాన్ని బలంగా వినిపించి వారి గొంతుకగా ప్రభుత్వం దిగివచ్చేవరకూ పోరాడాలి.