రాహుల్‌ గాంధీ.. రేపు మాపో బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు

22 Feb, 2024 13:02 IST

 తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. రేపు మాపో బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. 
‘కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల కొరత ఎక్కువగా ఉంది. రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది. ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది’ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు హస్తం పార్టీని వీడిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.