కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్ 

21 Oct, 2025 17:58 IST

కాకినాడ‌:  కూట‌మి ప్ర‌భుత్వంలో ప‌బ్లిసిటీ పీక్ స్టేజీలో ఉంద‌ని, ప‌నిలో మాత్రం వీక్‌గా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం కాకినాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`2019-24 కాలంలో దేశంలో ఎక్కడ జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సిఎం వైయ‌స్ జగన్ తీసుకువ‌చ్చారు. అయితే గతం మరచిపోయిన చంద్రబాబు.. అన్ని తానే చేశాను అంటున్నారు. దీనినే క్రెడిట్ చోరి అంటారు. వైయ‌స్‌ జగన్ చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరిస్తే చాలు ఒక్క నిజం ఉండ‌దు,తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్, పోర్టులను తామే కొబ్బరికాయ‌ కొట్టి ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ కూడా చేయ‌లేదు. సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తన క్రెడిట్ గా చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. దీనికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్ గా నియమించారు. ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇస్తున్న‌ట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది. గతంలో వైయ‌స్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ‌మ‌ని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమిటీ నాయకులను గృహ నిర్భందం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి...  అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014 కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని చంద్ర‌బాబు హమీ ఇచ్చాడు. సెజ్ కోసం భూసేకరణ ముఖ్యం.. గ్రామాలు ఎలా పోయిన ఫ‌ర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి.158 జీవో ద్వారా స్ధానికులకు 78 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను వైయ‌స్ జగన్ ఎత్తివేశారు. వాటిలో ఇంకా ఉన్న  కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు  ఇప్పించారు. జీఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మ‌శానాలు, చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబు కు లేదు` అంటూ క‌న్న‌బాబు ఫైర్ అయ్యారు.