ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం
19 Jan, 2021 19:40 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైయస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల అధికారికి సోమవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించగా.. మంగళవారం ఆమోదం లభించింది