9న పుంగనూరుకు వైయ‌స్‌ జగన్‌

5 Oct, 2024 12:08 IST

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో కిడ్నాప్, ఆపై హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజుమ్‌ (7) కుటుంబాన్ని పరామర్శించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ , మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన పుంగనూరుకు రానున్నారు. ఈ మేరకు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అంజుమ్‌ కిడ్నాప్, హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించేందుకు వైయ‌స్‌ జగన్‌ రానున్నారని, మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు కూడా వస్తారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ  అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు.