వైయస్ జగన్‌కు క్రెడిట్ వస్తుందన్న భయంతోనే అదానీ పేరెత్తలేదు
విశాఖపట్నం: వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుందనే భయంతోనే అదానీ పేరు చెప్పకుండా గూగుల్ డేటా సెంటర్ పేరుతో చివరి నిమిషం వరకు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకున్నారని, నిన్న వైయస్ జగన్ ప్రెస్‌మీట్ తర్వాత ప్రజలకున్న అనుమానాలన్నీ తొలగిపొయాయని అనకాపల్లి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రెస్‌మీట్ తర్వాత కూటమి కుట్రలను ప్రజలు అర్ధం చేసుకున్నారని, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పుకోలేక గూగుల్ డేటా సెంటర్ ని వైయస్ఆర్‌సీపీవ్యతిరేకించిందని ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకి దమ్ముంటే గూగుల్ డేటా సెంటర్‌లో అదానీ భాగస్వామ్యం లేదని చెప్పగలరా అని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వైయస్ఆర్
టీడీపీలో డేటా సెంటర్ ప్రకంపనలు
వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తర్వాత గూగుల్ సెంటర్ కి సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయన్న ఉద్దేశంతో రాష్ట్ర కేబినెట్ మొత్తం బరిలోకి దిగిపోయింది. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందిపోయి మాజీ ముఖ్యమంత్రిపై నోరుపారేసుకుంటున్నారే కానీ, ఆయన చెప్పినవి అబద్ధాలని మాత్రం చెప్పలేకపోతున్నారు. డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం ఎక్కడ పడింది. దాని వెనుక వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన కృషి ఏంటి? అదానీతో జరిగిన ఒప్పందం తదితర వివరాలను మాజీ నాయకులు వైయస్ జగన్ ఆధారాలతో సహా మీడియా సాక్షిగా ప్రజల ముందుంచారు. గూగుల్‌తో ఎంఓయూ చేసుకునే చివరి నిమిషం వరకు కూడా అదానీ పేరు బయటకు రాకుండా ఎందుకు తొక్కిపెట్టారనే విషయం కూడా వెల్లడించారు. ఎంఓయూ చేసుకున్న గంట వ్యవధిలోనే అదానీ తన ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్టు పెట్టిన విషయాన్ని బట్టి తెరవెనుక జరిగిన కథలను, చంద్రబాబు కుట్రలను వైయస్ జగన్ మీడియాకు వివరించారు.
ఉద్యోగాలపై వాస్తవాలు చెప్పాలి
గూగుల్ డేటా సెంటర్ కి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం. కానీ ఎల్లో మీడియా మాత్రం మేం వ్యతిరేకం అన్నట్టు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వస్తోంది. గూగుల్ సంస్థ మాత్రమే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందన్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, కానీ గూగుల్ అనుబంధ సంస్థ రైడన్, ఎయిర్‌టెల్, అదానీ కలిసి విశాఖలో ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయని, దీంతోపాటు ఉద్యోగాల విషయంలో ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని కోరుతూ వచ్చాం. కేబినెట్ లో జరిగిన చర్చ ప్రకారం 200 ఉద్యోగాలే వస్తాయని సంస్థ చెబుతోందని, కానీ ప్రభుత్వం 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తోందని.. దీనిపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని మొదటిరోజు నుంచే వైయస్ఆర్‌సీపీడిమాండ్ చేస్తూ వచ్చింది.
వైయస్ జగన్‌కి మంచి పేరొస్తుంటే ఓర్వలేక
విశాఖ వేదికగా మే 3, 2023న అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే వైయస్ జగన్ చేతుల మీదుగా పునాదులు పడ్డాయి. అదానీ కంపెనీతో జరిగిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలు, వారికిచ్చే రాయితీలు, ఆ కంపెనీ కల్పించబోయే ఉద్యోగాలపై పూర్తిగా క్లారిటీతో జీవోలు విడుదల చేయడం జరిగింది. వాటిని శ్రీ వైయస్ జగన్ ప్రదర్శించారు. సబ్‌సీ కేబుల్ ఏర్పాటుకు సింగపూర్ ప్రభుత్వంతో ఆరోజే చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన లేఖలను వైయస్ జగన్ ప్రదర్శించారు. గూగుల్ అదానీకి ఉన్న సత్సంబంధాలపైనా ఆయన సవివరంగా ప్రెస్‌మీట్‌లో క్లారిటీ ఇచ్చారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వైయస్ జగన్ ఇంతగా కృషి చేస్తే ఆ పేరు బయటకు రాకుండా చంద్రబాబు కుట్ర చేశాడు. అదానీ డేటా సెంటర్ పేరు చెబితే అది వైయస్ జగన్ తీసుకొచ్చిందేనని ప్రజలు అంటారని, దాని ద్వారా వైయస్ జగన్‌కే మంచి పేరు వస్తుందనే భయంతో, సంకుచిత స్వభావంతో చివరి నిమిషం వరకు గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు మీడియాలో హడావుడి చేశాడు. ఈ ప్రాజెక్టులో అదానీ భాగస్వామ్యం ఉందని చెప్పడానికి కూడా చంద్రబాబు భయపడిపోయాడు. కానీ నేడు కూటమి ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ పేరుతో తీసుకొచ్చామని చెప్పుకుంటున్న ప్రాజెక్టులో యువతకు ఉద్యోగాల కల్పనపై క్లారిటీ ఇవ్వడం లేదు. డేటా సెంటర్ వల్ల 1.88 లక్షల డైరెక్టు ఉద్యోగాలు వస్తాయా లేక ప్రాజెక్టు బిల్డప్ చేస్తే తయారయ్యే ఎకో సిస్టం కారణంగా వచ్చే ఇన్‌డైరెక్ట్ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారో రాష్ట్ర యువతకు అర్థం కావడం లేదు. సాధారణంగా డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉద్యోగాలు రావని కూటమి నాయకులే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఎకో సిస్టం వల్ల వచ్చే అనధికార ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది.
అదానీ పేరును అధికారికంగానే గూగుల్ నోటిఫై చేసింది
ఈనెల 14న గూగుల్‌తో ఎంఓయూ జరిగితే సరిగ్గా పదిరోజుల తర్వాత అదానీ సంస్థను నోటిఫైడ్ పార్టనర్‌గా పరిచయం చేస్తూ గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనే వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కాటంనేని భాస్కర్‌కి లేఖ రాశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ అదానీ సంస్థ ఆధ్వర్యంలోనే తీసుకోవడం జరుగుతుందన్నట్టు అధికారికంగా ప్రకటించారు. గూగుల్ రాసిన లేఖ, అందులో ఉన్న అంశాలు, అదానీ ట్వీట్ ఇవన్నీ అదానీ డేటా సెంటర్ అని ధ్రువీకరిస్తున్నా ఆ పేరెత్తితే డేటా సెంటర్ తెచ్చిన క్రెడిట్ వైయస్ జగన్‌కి వెళ్లిపోతుందన్న భయంతోనే గూగుల్ పేరుతో చంద్రబాబు క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. వైయస్ జగన్ మీడియా సమావేశంతో డేటా సెంటర్ ఏర్పాటు వెనుక అసలు నిజాలతోపాటు ఉద్యోగాల కల్పన విషయంలో జరిగిన కూటమి ప్రభుత్వ మోసాలు బయటపడిపోవడంతో వైయస్ జగన్ మీద బురద జల్లడానికి ఎల్లో మీడియాను బరిలోకి దించారు. గూగుల్ డేటా సెంటర్‌కి అదానీతో సంబంధం లేదని కూటమి నాయకులు చెప్పగలరా?
వైయస్ఆర్‌సీపీ కృషి వల్లే భోగాపురం ఎయిర్‌పోర్ట్
చంద్రబాబు మాదిరిగా వైయస్ జగన్ శిలాఫలాకాలు వేసే ముఖ్యమంత్రి కాదు. ఎవరో చేసిన పనిని తనదిగా చెప్పుకునే దౌర్భాగ్యం ఆయనకు లేదు. చంద్రబాబు శిలాఫలకం వేసి పూర్తి చేసిన ప్రాజెక్టు ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కటీ లేదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి 2019 ఎన్నికలకు ముందు రెండు నెలల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేయడం మినహా చేసిందేమీ లేదు. ఆరోజున టీడీపీ ప్రభుత్వం దగ్గర కేవలం 350 ఎకరాలుంటే ఎన్నికల్లో లబ్ధి కోసం ఎయిర్‌పోర్టు కడతున్నట్టు కలరింగ్ ఇచ్చుకున్నాడు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే 2700 ఎకరాలు సేకరించి, నాలుగు గ్రామాలను రీహాబిలిటేట్ చేసి, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి, వేరే ప్రాంతాల్లో ఇళ్లు, రూ. 10 లక్షల డబ్బులిచ్చి, కాంపౌండ్ వాల్ నిర్మించి పనులు మొదలుపెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్లాం. అంతేకాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం రూ.450 కోట్లు, భూసేకరణ కోసం మరో రూ. 400 కోట్లు ఖర్చు చేశాం. దీంతోపాటు పనులు అడ్డుకోవాలని చంద్రబాబు వేసిన కోర్టు కేసులను కూడా అధిగమించి 40శాతం పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్లాం. కానీ ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కట్టింది మేమే అన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం, పోర్టు నిర్మాణ పనులు కూడా వైయస్ఆర్‌సీపీ హయాంలోనే శరవేగంగా జరిగాయి. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి మొత్తంగా 7 కాలేజీలు పూర్తి చేశాం. కానీ చంద్రబాబు తన జీవిత కాలంలో కట్టిన మెడికల్ కాలేజీ ఒక్కటీ లేదు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ మార్కెటింగ్ చేసుకోవడం తప్ప, రాష్ట్రానికి చేసింది కానీ, చేస్తున్నది కానీ ఏదీ లేదు. చంద్రబాబు క్రెడిట్ చోర్. 2018 డిసెంటర్ నాటికి విశాఖలో మెట్రో రైల్ పట్టాలెక్కబోతుందని నారా లోకేష్ ట్వీట్ చేశాడు. ఇదీ వారి చిత్తశుద్ది. మాటలు, ప్రచార ఆర్భాటం తప్ప తండ్రీకొడుకుల దగ్గర చేతలు కానరావు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు సైతం చంద్రబాబు జేబు పార్టీగా మారిపోయారు. నరేంద్ర మోడీని ఏమన్నా అన్నా పట్టించుకోరు కానీ, చంద్రబాబుని అంటే మాత్రం వారు తట్టుకోలేరు. ఒంటి కాలిమీద లేచి నిలబడి మీడియా ముందుకొస్తారు. చంద్రబాబు ఇకనైనా తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది.