మహాకావ్య సృష్టికర్త వాల్మీకి
కర్నూలు: రామాయణ మహాకావ్య సృష్టికర్త మహర్షీ వాల్మీకి అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్‌ఈసీ) సభ్యులు, మాజీ కుడా చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కొనియాడారు. మహర్షీ వాల్మీకి జయంతి వేడుకలను మంగళవారం కోడుమూరు, గూడురు మండల కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి విగ్రహాన్ని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక సామాన్య వ్యక్తిగా పుట్టిన బోయవాడు.. అడవిలో పెరిగి సప్తఋషుల బోధనల ద్వారా మహర్షీగా మారాడని అన్నారు. భవిష్యత్తు తరాలకు రామాయణ మహా గ్రంధాన్ని అందించిన మహర్షి వాల్మీకి బోయ కులంలో జన్మించి తన తపస్సు వలన ఋషిగా మారారని, సుమారు 23 వేల శ్లోకాలతో రామయాణాన్ని రచించారని పేర్కొన్నారు. సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి రామాయణ మహాకావ్యం బాటలు వేస్తుందని, ఇంతటి మహోన్నత గ్రంథాన్ని అందిం చిన వాల్మీకిని ప్రతీఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, కోడుమూరు నియోజకవర్గల అబ్జర్వర్ కర్ర హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి, గూడూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ జె వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ అస్లాం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్ వెంకటేశ్వర్లు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు, కౌన్సిలర్ కుమార్, కోడుమూరు మండల కన్వీనర్ రమేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివ రాముడు, రవి కుమార్ రెడ్డి, వాలంటరీ విభాగం జిల్లా కార్యదర్శి తేనేశ్వర్ రెడ్డి, ఉల్చాల రామ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ మాదాలు, గూడూరు పట్టణ కన్వీనర్ అబెల్, వైస్ కన్వీనర్ గంగాధర్, వార్డు మెంబెర్స్ విష్ణు దాస్, హనుమంత్, లింగన్న, గిడ్డయ్య , చంటి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.