కూటమి వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం
12 Jul, 2025 12:37 IST
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీకాకుళం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించి శనివారం శ్రీకాకుళం నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.