మంత్రి పేర్ని నానితో ఆర్.నారాయణమూర్తి భేటీ
30 Dec, 2021 12:00 IST
కృష్ణా: సినిమాటోగ్రఫీ, సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి, పలువురు థియేటర్ల ఓటర్లు భేటీ అయ్యారు. మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి.. పలు అంశాలపై చర్చించారు. ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగానూ నెలరోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపులపై జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు.