మామిళ్లపల్లెలో ఉద్రిక్తత

20 May, 2026 12:21 IST

గుంటూరు: జిల్లాలోని మామిళ్లపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొన్నూరు వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబ‌టి ముర‌ళీకృష్ణ‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అంబటి మురళి నివాసంలో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌రావును పోలీసులు బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి జూపూడి ప్రభాకర్‌ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపూడి ప్రభాకర్‌, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల వ్యవహార శైలిపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.