టీడీపీని రద్దు చేయాలని ఈసీని కోరుతాం
22 Oct, 2021 12:24 IST
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల బూతు పురాణాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి ఆ పార్టీ గుర్తింపునురద్దు చేయాలని కోరుతామని ఎంపీ బాలశౌరి తెలిపారు. శుక్రవారం మచిలీపట్నంలో రెండో రోజు జనాగ్రహ దీక్షలో ఆయన పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఈసీని కలిసి టీడీపీని రద్దు చేయాలని కోరుతామని, అన్ని రాజకీయ పార్టీలను కలిసి చంద్రబాబు వ్యవహారశైలిని వివరిస్తామన్నారు.