మొరంపల్లె రామిరెడ్డి వైయస్ఆర్‌సీపీలో చేరిక
4 Mar, 2019 15:49 IST
హైదరాబాద్: ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతలు మధ్య రోజు రోజుకు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తంబల్లపల్లె నియోజకవర్గం నుంచి మొరంపల్లె రామిరెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ప్రమీలమ్మ ఆధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వారు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.