రహదారుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం
17 Mar, 2023 11:57 IST
అసెంబ్లీ: రహదారుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అసెంబ్లీలో వివరించారు. రోడ్ల నిర్వహణకు సంబంధించి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దాడిశెట్టి రాజా సమాధానమిచ్చారు. ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో రూ. 3,825 కోట్లతో 7,700 కిలోమీటర్ల రహదారులను రెన్యూవల్ చేసిందని, 10,359 కిలోమీటర్ల రహదారులను మరమ్మతులు చేసిందన్నారు. రెండో విడతలో ప్రభుత్వంలో రూ.1,122 కోట్లతో 3,432 కిలోమీటర్ల రహదారులను ప్రత్యేక మరమ్మతులు చేయడం కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో రూ.502 కోట్లతో 466 కిలోమీటర్ల రహదారులను పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు.